ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఫుట్‌బాల్ మ్యాచ్
మండలే (మయన్‌మార్): ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు శుభారంభం చేసింది. టోక్యో 2020 ఒలింపిక్స్ కోసం జరిగిన క్వాలిఫయింగ్ తొలి మ్యాచ్‌లో భారత మహిళా ఫుట్‌బాల్ జట్టు 2 గోల్స్‌తో ఇండోనేషియాను చిత్తు చేసింది. ఇటీవల ముగిసన శ్యాప్ ఫుట్‌బాల్ టోర్నీలో అద్భుతమైన ప్రదర్శణ కనబర్చిన భారత అమ్మాయిలు క్వాలిఫయింగ్ మ్యాచ్‌లోనూ అదే జోరును ప్రదర్శించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. మ్యాచ్ 27వ నిమిషంలో భారత్‌కు తొలి గోల్‌ను అందించిన భారత అమ్మాయిలు.. 67వ నిమిషంలో మరో గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశారు. ఇక మ్యాచ్ చివరి వరకు మరో గోల్ నమోదు కాకపోవడంతో భారత్ 2 విజయం సాధించింది.
ఇండోనేషియాపై భారత్ విజయం
RELATED ARTICLES