క్వార్టర్స్‌లో అర్జెంటీనాకు షాక్
హాకీ ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా
భువనేశ్వర్: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో అర్జెంటీనాపై ఇంగ్లాండ్ సంచలన విజయం సాధించి సెమీఫైనల్లో ప్రవేశించింది. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా కూడా ఫ్రాన్స్‌ను చిత్తు చేసి సెమీస్‌లో దూసుకెళ్లింది. ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనాను ఒక గోల్ తేడాతో ఓడించి ఇంగ్లాండ్ సంచలనం సృష్టించింది. బుధవారం జరిగిన క్వార్టర్ మొదటి ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ ఏడో ర్యాంక్ ఇంగ్లాండ్ 3- గోల్స్ తేడాతో ప్రపంచ రెండో ర్యాంక్ అర్జెంటీనాపై రికార్డు విజయం సాధించింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ మూడో సారి ప్రపంచకప్ సెమీస్‌లో అడుగుపెట్టింది. అర్జెంటీనా తరఫున పెలాట్ గొంజాలో ఒక్కడే రెండు గోల్స్ చేసినా ఇతర ఆటగాళ్లు నిరశపరిచారు. దీంతో ప్రపంచకప్ హాట్ ఫెవరెట్ అర్జెంటీనా మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ ఆరంభం నుంచే రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. 17వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు పెలాట్ గొంజాలో గోల్ చేసి తమ జట్టు ఖాతా తెరిచాడు. తర్వాత 27వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు మిడిల్టన్ బారి కళ్లు చెదిరే గోల్‌తో తమ జట్టుకు తొలి గోల్ అందించి ఇరు జట్ల స్కోరును సమం చేశాడు. తర్వాత 45వ నిమిషంలో ఇంగ్లాండ్ ఆటగాడు కాల్నన్ విల్ మరో గోల్ చేసి తమ జట్టుకు 2- ఆధిక్యం అందించాడు. చివర్లో అర్జెంటీనా ఆటగాడు పెలాట్ గొంజాలో 48వ నిమిషంలో మరో అద్భుతమైన గోల్‌తో ఇంగ్లాండ్ ఆధిక్యాన్ని సమం చేశాడు. కానీ, వారి సంతోషం ఎక్కువసేపు నిలువలేకపోయింది. ఒక నిమిషం వ్యవధిలోనే మార్టిన్ హారి (49వ)నిమిషంలో ఇంగ్లాండ్‌కు మూడో గోల్ అందించి తమ జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఆసీస్ చేతిలో ఫ్రాన్స్ చిత్తు…
ఇక్కడ జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా 3- గోల్స్‌తో ఫ్రాన్స్‌ను చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టింది. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఫ్రాన్స్‌పై వరుసదాడులు చేస్తూ హడలెత్తించింది. వీరి దాడులను నిలువరించలేక ఫ్రాన్స్ చెతులెత్తేసింది. దీంతో ఆసీస్ జట్టు హ్యాట్రిక్ గోల్స్‌తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా తరఫున (4వ) నమిషంలో హేవర్డ్ జెర్మి, (19వ) నిమిషంలో గోవర్స్ బ్లేక్, (37వ) నిమిషంలో అరాన్ గోల్స్ చేశారు.
ఇంగ్లాండ్ సంచలనం
RELATED ARTICLES