HomeNewsBreaking Newsఆస్కార్‌ పోటీలో ‘నాటు నాటు’

ఆస్కార్‌ పోటీలో ‘నాటు నాటు’

చరిత్ర సృష్టించిన తెలుగుపాట
బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగానికి ఎంపిక
లాస్‌ ఎంజెల్స్‌ :
ప్రఖ్యాత దర్శకుడు ఎస్‌ఎస్‌.రాజమౌళి నిర్మించిన బ్లాక్‌ బస్టర్‌ ఫాంటసీ చిత్రం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ లోని ‘నాటు నాటు…’ అనే పాట ఆస్కార్‌ పోటీలకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఎంపిక అయ్యింది. 95వ ఆస్కార్‌ పోటీలకు ఎంపికైన చిత్రాలు, వివిధ విభాగాల్లో ఎంపిక అయిన ఇతర అంశాల జాబితాను విడుదల చేశారు. ఈ ఆస్కార్‌ పోటీలకు 23 కేటగిరీలలో చిత్రాలను ఎంపిక చేశారు. ఈ విధంగా ఆర్‌ ఆర్‌ ఆర్‌ చిత్రం మరోసారి చరిత్ర సృష్టించింది. అవతార్‌, ద వే ఆఫ్‌ వాటర్‌, ఎల్విస్‌, ఎవ్విర్‌ థింగ్‌ ఎవ్విర్‌ వేర్‌ ఆల్‌ ఎల్‌ ఒన ద బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌, ద ఫాబెల్‌మ్యాన్స్‌, తార్‌, టాప్‌ గన్‌ ః మారిక్‌, ఆల్‌ క్వయిట్‌ ఆన్‌ ద వెస్ట్రన్‌ ఫ్రంట్‌, ఉమెన్‌ టాకింగ్‌, ట్రయాంగిల్‌ ఆఫ్‌ శాడ్‌ నెస్‌ అనే పది చిత్రాలు ఈ 95వ ఆస్కార్‌ పోటీలలో ప్రముఖంగా ఎంపిక అయ్యాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని ఈ “నాటునాటు…” పాటల స్వరకర్త కీరవాణికి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ గ్లోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు లభించింది. ఈ బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో “నాటు నాటు…” పాటతోపాటు మహిళలకోసం మహిళలు తీసిన “టెల్‌ ఇట్‌ లైక్‌ ఎ ఉమెన్‌” చిత్రంలోని ‘అప్లాజ్‌’, 2022లో విడుదలైన యాక్షన్‌ డ్రామా చిత్రం “టాప్‌ గన్‌ ః మేవరిక్‌”లోని హాల్డ్‌ మై హ్యాండ్‌..’ కూడా ఈ విభాగంలో ఎంపిక అయ్యాయి. దీంతోపాటు ‘బ్లాక్‌ పాంథర్‌ ః వకండా ఫరెవర్‌” చిత్రలోని “లిఫ్ట్‌ మి అప్‌..’, “ఎవ్విర్‌థింగ్‌ ఎవ్విర్‌ వేర్‌ ఆల్‌ ఎట్‌ ఒన్స్‌” చిత్రం నుండి ‘దిస్‌ ఈజ్‌ ఏ లైఫ్‌’ కూడా ఈ విభాగంలో ఎంపిక అయ్యాయి. కాగా, ఆస్కార్‌ అవార్డులకోసం 300 చిత్రాలు దరఖాస్తు చేసుకోగా, జ్యూరీ సభ్యులు ఓటింగ్‌ ద్వారా ఉత్తమ చిత్రాలను ఎంపిక చేశారు. కాలిఫోర్నియాలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది. హాలివుడ నటులు రిజ్‌ అహ్మద్‌, అల్లిసన్‌ విలియమ్స్‌ ఇద్దరూ ఈ అవార్డుల కోసం వివిధ కేటగిరీలకు ఎంపికైన చిత్రాలను ప్రకటించారు. మార్చి 12వ తేదీన ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. “మేం చరిత్ర సృష్టించాం, ఇదెంతో గర్వకారణం, ఈ విషయం చెప్పడం మాకు ఎంతో గౌరవదాయకం. నాటు నాటు…పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాగ్‌ కోసం అస్కార్‌ పోటీలకు ఎంపిక అయ్యింది” అని ఈ చిత్రం అధికారిక వెబ్‌సైట్‌ ట్వీట్‌ చేసింది. అల్లూరి సీతారామరాజు చిత్రంలో తెలుగువీర లేవరా…పాట జాతీయస్థాయిలో మొదటిసారి ఎంపిక కావడం దగ్గర నుండి మన పాట క్రమంగా ఎదిగి అంతర్జాతీయస్థాయికి చేరుకుంది. 22 ఏళ్ళనాడు ’లగాన్‌’ తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ కావడం గమనార్హం. అయితే ఆనాడు చివరి వరకూ వెళ్ళినప్పటికీ నిరాశే మిగిలింది. అయితే, 2008లో ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’లో ఏ.ఆర్‌.రెహమాన్‌, రసూల్‌ పూకుట్టిల “జై హో…” పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కింద ఆస్కార్‌ అవార్డు లభించగా, ఇప్పుడు మళ్ళీ మన తెలుగుపాట అదే జాబితాలో ఆస్కార్‌ బరిలో నిలిచింది. డాక్యుమెంటరీ ఫీచర్‌ కేటగిరిలో షానూక్‌సేన్‌ ’ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’, డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌ విభాగంలో ’ది ఎలిఫెంట్‌ విష్పర్స్‌’ నామినేట్‌ అయ్యాయి. స్వాతంత్య్రానికి ముందు జరిగిన పోరాటకాలంలోని ఇతివృత్తంతో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని నిర్మించారు. అందులో వలసవాద సంస్కృతికి, భారతీయ సంస్కృతికి, భావజాలానికి మధ్య జరిగిన పోరాటాన్ని చూపించారు. ఈ పోరాట యోధులుగా జూనియర్‌ ఎన్‌టిఆర్‌, రామ్‌చరణ్‌లు నటించారు.
ఉత్తమ దర్శకుడు విభాగంలో మార్టిన్‌ మెక్‌డొనాగ్‌ (ది బన్షీస్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌), డానియెల్‌ క్వాన్‌, డానియెల్‌ స్కీనెర్ట్‌ (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌), స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌), టడ్‌ ఫీల్‌ (టార్‌), రూబెన్‌ ఆస్ట్లాండ్‌ (ట్రైయాంగిల్‌ ఆఫ్‌ సాడ్‌నెస్‌) ఉత్తమ నటుడు విభాగంలో, ఆస్టిన్‌ బట్లర్‌ (ఎల్విస్‌), కొలిన్‌ ఫార్రెల్‌ (ది బాన్షీస్‌ ఆఫ్‌ ఇనిషైరైన్‌)
, బ్రెండన్‌ ఫ్రాసెర్‌ (ది వేల్‌), పాల్‌ మెస్కల్‌ (ఆఫ్టర్‌సన్‌), బిల్‌ నిగీ (లివింగ్‌), ఉత్తమ నటి విభాగంలో కేట్‌ బ్లాంషెట్‌ (టార్‌),అన్నా దె అర్మాస్‌ (బ్లాండ్‌), ఆండ్రియా రైజ్‌బరో (టు లెస్లీ), మిషెల్‌ విలియమ్స్‌ (ది ఫేబుల్‌మ్యాన్స్‌), మిషెల్‌ యో (ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌) ఎంపికయ్యాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments