ఆసీస్ 326&132/4
సెంచరీతో చెలరేగిన కోహ్లీ
భారత్ తొలి ఇన్నింగ్స్ 283 ఆలౌట్
పెర్త్: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆథిత్య ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్‌పై పట్టు బిగిస్తూ భారీ ఆ ధిక్యం వైపు దూసుకెళ్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులు చేసిన ఆస్ట్రేలియా రెండో ఇనింగ్స్‌లో కూ డా ధాటిగానే ఆడుతోంది. ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై 43 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులతో ముందంజలో ఉంది. చేతిలో మరో 6 వికెట్లు ఉండడంతో భారత్ ముందు పెద్ద లక్ష్యం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్స్ అవుటైనా ఇప్ఫుడు ఉస్మాన్ ఖవాజా (41 బ్యాటింగ్), టిమ్ పైన్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్ శర్మ, బుమ్రాలకు తలొ క్క వికెట్ దక్కింది. అంతకుముందు టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు ఆలౌటైంది. భారత సారథి విరాట్ కోహ్లీ (123; 257 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన సెంచరీతో కెప్టెన్ ఇ న్నింగ్స్ ఆడాడు. మరోవైపు అజింక్యా రహానే (51), రిషభ్ పంత్ (36), హనుమ విహారి (20) పరుగులతో పర్వాలేదనిపించారు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మె న్స్ మరోసారి విఫలమయ్యారు.
ఆసీస్‌కు ఆధిక్యం
RELATED ARTICLES