HomeNewsBreaking Newsఆలేరులో ఘోర రోడ్డు ప్రమాదం

ఆలేరులో ఘోర రోడ్డు ప్రమాదం

ట్రాక్టర్‌ను డీకొన్న ఆర్టీసీ బస్సు
ముగ్గురు కూలీలు మృత్యువాత

ప్రజాపక్షం/ఆలేరు : యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోజువారీ కూలీలను మృత్యువు కబళించింది. హైదరాబాద్‌ వరంగల్‌ జాతీయ రహదారిపై ఆలేరు వద్ద ఆర్టీసీ బస్సు ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం వరంగల్‌ 1 డిపోకు చెందిన ఎపి 36 జెడ్‌ 275 బస్సు వరంగల్‌ నుండి హైదరాబాదుకు వెళ్లే క్రమంలో ఆలేరు బైపాస్‌ మంతపురివద్ద రోడ్డు శుభ్రత పనులను నిర్వహిస్తున్న కూలీల పైకి దూసుకెళ్లింది.ఈక్రమంలో అతివేగంగా వచ్చిన బస్సు ఢీకొనడం తో నిలిచి ఉన్న ట్రాక్టరు , రోడ్డు సూచికలు ఏర్పాటు చేసుకొని పనులు చేస్తున్న కూలీలు చెల్లా చెదురుగా పడిపోవడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యా యి. మృతులు భువనగిరి మండలం రాయగిరి గ్రామానికి చెందిన ఊరెళ్ల శ్యాం,ఊరెళ్ల లావణ్య, అంకర్ల లక్ష్మి, అంకర్ల కవితగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్దలానికి చేరుకుని మృతుదేహాలని,తీవ్ర గాయాల పాలైన క్షత గాత్రులను ఆసుపత్రి కి తరలించారు.ప్రమాదానికి అతివేగమే కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ విప్‌ ,ఆలేరు ఎంఎల్‌ఏ గొంగిడి సునిత మహేందర్‌ రెడ్డి ఘటనాస్దలాన్ని సందర్శించి సూచికలు ఏర్పాటు చేసుకొని పనులు చేస్తున్న కూలీలు మృతి చెందడం బాదాకరమని బాదితులను పరామర్శించి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని చెప్పారు.ప్రమాద ఘటనపై సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు మాట్లాడుతూ రాయగిరి గ్రామానికి చెందిన
రోజువారీ పేద కూలీలు మృతి చెందడం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌ గ్రేసియా చెల్లించి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.ఈ ప్రమాదం పై అధికారులు పూర్తి విచారణ చేసి భాద్యులపై చర్యలు తీసుకోవాలని బిజేపి పట్టణ కార్యదర్శి బందెల సుభాష్‌ అన్నారు. బైపాస్‌ నిర్మాణం అనంతరం చాలావరకు ఎక్స్‌ప్రెస్‌ బస్సులు సైతం ఆలేరు బస్‌ స్టేషను కు రావడం లేదని త్వరగా వెళ్లాలనే ఆతృతతో బైపాస్‌ మార్గం ద్వారా అతివేగం అజాగ్రత్తగా వెళుతూ ప్రమాదాలు జరుగడానికి కారణమవుతున్న డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments