వరుస ఓటములతో సతమతమవుతున్న మాజీ చాంపియన్
జైపూర్ : మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస ఓటముల్లో బెంగళూరుతో పోటీపడుతోంది. ఐదు మ్యాచులాడి నాలుగింట్లో ఓడిపోయింది. ఆదివారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ భారీ ఓటమిని చవిచూసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్.. బ్యాట్స్మెన్లు విఫలమవడంతో నిర్ణీత ఓవర్లలో 139 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత ఛేదనలో నైట్‌రైడర్స్ బ్యాట్స్మెన్లు విజృంభించడంతో 14 ఓవర్లు కూడా ముగియక ముందే మ్యాచ్‌కు తెరపడింది. ఫలితంగా కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే తాజా ఓటమితో రాజస్థాన్ రాయల్స్ తన ఓటముల సంఖ్యను నాలుగు చేర్చుకుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ నాలుగు మ్యాచుల్లో ఓటమి రుచి చూసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ క్రింది నుంచి రెండో స్థానంలో నిలించింది. రహానె సారథ్యంలోని రాజస్థాన్ వరుస ఓటములతో ఆర్సిబిని తలపిస్తుందని ఆర్ఆర్ అభిమానులు మండి పడుతున్నారు. తాజా మ్యాచ్‌లో ఆర్ఆర్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఘోరంగా విఫలమయ్యారు. తొలుత బ్యాటింగ్‌లో చాలా వికెట్లు ఉన్న దూకుడుగా ఆడలేక పోయారు. తర్వాత బౌలింగ్‌లోనూ ప్రభావం చూపకపోవడంతో కోల్‌కతా ఆల్‌రౌండ్ షోతో ఏకపక్షంగా విజయం సాధించింది.
ఓటములపై ఆందోళన వద్దు : రహానె
ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ సారథి అజింక్యా రహానె మ్యాచ్ అనంతరం మాట్లాడాడు. ఓటములతో భయపడాల్సిన పనిలేదంటూ జట్టు సభ్యుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు. మ్యాచ్ ఓడిపోతేనే ఎక్కువగా ఆలోచనలు వస్తుంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. అంతా సవ్యంగా సాగితే మనం ఎక్కువ విషయాలు తెలుసుకునే అవకాశం ఉండదు. ఓటముల గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకూ అన్ని మ్యాచుల్లోనూ బాగానే ఆడాం. మూడింట్లో గెలిచే అవకాశం ఉన్నా స్వల్ప తేడాతో మ్యాచ్‌లు చేజారిపోయాయి. తమ ఆటగాళ్లు చివరి వరకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఆఖరికి మాత్రం తమకు నిరాశజనకంగానే నిలుస్తోంది. టి20 క్రికెట్లో రిస్క్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలా అని ఓటమిని ఒకరి మీద మోపడం సరికాదు. క్రీజులో కుదురుకున్న బ్యాట్స్మెన్లు ఇన్నింగ్స్ చివరి వరకూ ఉండేందుకు ప్రయత్నించాలి. మంచి భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టుకు అండగా నిలవాలి. ఒక మ్యాచ్‌లో కనీసం రెండన్న పెద్ద భాగస్వామ్యాలు ఏర్పర్చితే చాలని, ఛేదన కష్టమనుకున్న మైదానంలో ప్రత్యర్థులకు మనం కనీసం 150 నుంచి 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది. తమ తప్పులను ఓసారి పరిశీలుంచుకోని సరిదిద్దుకుంటే మంచి ఫలితాలు రాబట్టుకోవచ్చని, అప్పుడు విజయాలు వాటంతటత అవే వస్తాయని రహానె పేర్కొన్నాడు.
ఆర్సిబి బాటలోనే రాజస్థాన్
RELATED ARTICLES