HomeNewsBreaking Newsఆర్థిక శాస్త్రంలో… ముగ్గురికి నోబెల్‌

ఆర్థిక శాస్త్రంలో… ముగ్గురికి నోబెల్‌

బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై విస్తృత పరిశోధనలకు వరించిన అవార్డు
బెన్‌ బెర్నాంకే, డగ్లస్‌ డైమండ్‌, ఫిలిప్‌ డైబ్‌విగ్‌కు పురస్కారం
స్టాక్‌హోమ్‌:
బ్యాంకులు, ఆర్థిక సంక్షోభాలపై విస్తృత పరిశోధనలు చేసిన ముగ్గురిని ఈ ఏడా ది నోబెల్‌ పురస్కారం వరించింది. ఈనెల 3న స్వీడన్‌కు చెందిన ప్రముఖ సైంటిస్టు స్వాంటే పాబోను వైద్య రంగంలో నోబెల్‌ గ్రహీతగా అవార్డుల కమిటీ ప్రకటించిన విషయం తెలిసింది. అప్పటి నుంచి ఈనెల 7వ తేదీ వరకూ వరుసగా వివిధ రంగాల్లో నోబెల్‌ విజేతల పేర్లను ప్రకటిస్తూ వచ్చింది. శని, ఆదివారాలు సెలవు కాగా, ఆర్థిక శాస్త్రంలో ముగ్గురి పేర్లను సోమవారం ప్రకటించింది. దీనితో ఈ ఏడాది నోబెల్‌ అవార్డు విజేతల జాబితా పూర్తయింది. బ్యాంకుల పనితీరు మరింత మెరుగుపరచడంతోపాటు ఆర్థిక సంక్షోభాల నివారణకు చేపట్టాల్సిన వివిధ అంశాలపై పరిశోధన చేసినందుకుగాను అమెరికాకు చెందిన బెన్‌ బెర్నాంకే, డగ్లస్‌ డైమండ్‌, ఫిలిప్‌ డైబ్‌విగ్‌కు ఆర్థిక శాస్త్రం లో నోబెల్‌ లభించింది. బెర్నాంకే గతంలో అమెరికా కేంద్ర బ్యాంకు యుఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌కు చైర్మన్‌గా సేవలు అందించారు. వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, ఆర్థిక రంగాలతోపాటు విశ్వశాంతికి కృషి చేసిన వారికి శాంతి బహుమతిని కూడా నోబెల్‌ కమిటీ ఏటా అంచేస్తుంది. డైనమైట్‌ను కనిపెట్టిన ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ జ్ఞాపకార్తం స్వీడిష్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ బహుమతులను ప్రకటిస్తున్నది.
ఈ ఏడాది నోబెల్‌ బహుమతి విజేతల జాబితా..

  1. స్వాంటే పాబో (స్వీడన్‌)/ వైద్య రంగం, 2. అలైన్‌ ఆస్పెక్ట్‌ (ఫ్రాన్స్‌), జాన్‌ క్లాసర్‌ (అమెరికా), ఆంటోన్‌ జెలింగర్‌ (ఆస్ట్రియా)/ భౌతిక శాస్త్రం, 3. కరోలిన్‌ రూత్‌ బెర్టోజీ (అమెరికా), మార్టెన్‌ మెల్డల్‌ (నెదర్లాండ్స్‌), కారీ బార్టీ షార్ప్‌లెస (అమెరికా)/ రసాయన శాస్త్రం, 4. అనీ ఎర్నాస్ట్‌ (ఫ్రాన్స్‌)/ సాహిత్యం, 5. అలెస్‌ బియాలియాట్‌స్కీ (బెలారస్‌), మెమోరియల్‌ మానవ హక్కుల సంఘం (రష్యా), సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (ఉక్రేన్‌)/ శాంతి, 6, బెన్‌ బెర్నాంకే (అమెరికా), డగ్లస్‌ డైమండ్‌ (అమెరికా), ఫిలిప్‌ డైబ్‌విగ్‌ (అమెరికా)/ ఆర్థిక రంగం.
DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments