బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్వర్గియ
కోల్కత్తా: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం బిజెపి సర్కారు వెంటనే ఆర్డినెన్స్ తీసురావాలని విహెచ్పి, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న వేళ.. ఆ పార్టీ నేత ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిజెపి ప్రభుత్వం మందిర ని ర్మాణం కోసం ప్రస్తుతానికి ఆర్డినెన్స్ తేవాలని ఆలోచించడం లేదని ఆ పార్టీ జా తీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్వర్గియ అన్నారు. ఆదివారం ఆయన ఈ మేరకు కోల్కత్తాలో ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఆలయ నిర్మాణానికి సంబంధించి స్థల వివాదంపై ప్రస్తుతం సుప్రీంకోర్టు లో కేసు నడుస్తోందని ఈ సమయంలో మేము తొందరపడకూడదని భావిస్తున్న ట్లు తెలిపారు. ఈ విషయంలో అవసరమైతే కోర్టుకు మరోసారి అప్పీల్ చేస్తామ ని వెల్లడించారు. అయితే మందిర నిర్మాణం ఆలస్యమవడం బిజెపికి మంచి కం టే చెడే ఎక్కువ చేసిందని..ప్రతిపక్షాలు మైనార్టీలను భయపెట్టి ఓట్లు దండుకునే అవకాశాన్ని కల్పించినట్లుందని పేర్కొన్నారు. ఆలయం నిర్మించాలని ప్రజల ఆ కాంక్ష మరింత పెరిగినట్లుతై… అప్పుడు ఆర్డినెన్స్ తేవాలా..? వద్దా..? అనే అం శంపై ఆలోచిస్తామని అన్నారు. ప్రస్తుతానికి మాత్రం రామమందిర నిర్మాణంపై ఆర్డినెన్స్ తీసుకురావాలనే ఆలోచన తమ పార్టీకి లేదని చెప్పారు. కానీ, అయోధ్యలో ఆలయాన్ని నిర్మించే దమ్ము బిజెపికి తప్ప మరెవ్వరికీ లేదని తెలిపారు.
ఆర్డినెన్స్ తేవాలనే ఆలోచన లేదు
RELATED ARTICLES