HomeNewsBreaking Newsఆర్‌టిసి బస్సులకు ఆధునిక హంగులు

ఆర్‌టిసి బస్సులకు ఆధునిక హంగులు

సూపర్‌ లగ్జరీ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్‌
త్వరలో అందుబాటులోకి డబుల్‌ డెక్కర్‌ తీసుకొస్తామని వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్‌
కనుమరుగైన డబుల్‌ డెక్కర్‌ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు రాష్ట్ర రవాణ శాఖమంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. టిఎస్‌ ఆర్‌టిసికి చెందిన 50 అత్యాధునిక సూపర్‌ లగ్జరీ బస్సులకు ట్యాంక్‌బండ్‌ వద్ద శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సొంత వాహనాల వాడకాన్ని తగ్గించాలని కోరారు. కరోనా సమయంలో ఆర్‌టిసి రూ. 2 వేల కోట్లు నష్టపోయిందన్నారు. టిఎస్‌ ఆర్‌టిసి రూ.392 కోట్లతో మొత్తం 1,016 అధునాత బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిందన్నారు. అందులో భాగంగా మొదటి విడతలో 630 సూపర్‌ లగ్జరీ, 130 డిలక్స్‌, 16 స్లీపర్‌ బస్సులకు టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చామన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. తొలి విడత కొనుగోలు చేస్తున్న 760కిపైగా బస్సుల్లో 50 బస్సులను ప్రారంభించినట్టు మంత్రి చెప్పారు. మార్చి లోపల అన్ని బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ ఆర్‌టిసి చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, రవాణా, రహదారి, భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎం.డి. వి.సి. సజ్జనార్‌, రవాణ శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్ధ ప్రకాశ్‌, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments