ఆరో స్థానంలోకి భారత్‌

కరోనా కేసుల్లో ఇటలీని అధిగమించిన ఇండియా
కొత్తగా 9,887 కేసులు, 294 మరణాలు
2,36,657కు చేరుకున్న పాజిటివ్‌ కేసులు
న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ భారత్‌లో విలయ తాం డవం చేస్తుంది. మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. నిత్యం గరిష్టస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులు గా దేశంలో రికార్డుస్థాయిలో ప్రజలు మహమ్మా రి బారిన పడుతున్నారు. నిన్నటి వరకు కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఏడువ స్థానంలో ఉండగా, శనివారం నాటికి ఇటలీని దాటేసి ఆరవ స్థానానికి ఎగబాకింది. దేశంలో 24 గంటల్లో కొత్తగా 9,887 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. భారత్‌లో వైరస్‌ ప్రవేశించిన నాటి నుంచి ఇంత గరిష్టస్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. దీంతో కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 2,36,657కు చేరింది. అటు మృతుల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదైంది. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 294 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఒకే రోజులో ఈ స్థాయిలో మరణించడం కూడా ఇదే తొలిసారి. దీంతో మరణాల సంఖ్య 6,642కు పెరిగింది. భారత్‌లో 9 వేలకు పైగా కొత్త కేసులు నమోదుకావడం వరుసగా ఇది మూడవ రోజు. ప్రస్తుతం కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్‌ 6వ స్థానానికి చేరుకుంది. ప్రథమ స్థానంలో అగ్ర రాజ్యం అమెరికా కొనసాగుతుండగా, ఆ తరువాత స్థానాల్లో బ్రెజిల్‌, రష్యా, స్పెయిన్‌, యుకె, ఉండగా, 7వ స్థానంలో ఇటలీ ఉన్నది. ఇటలీలో ఇప్పటి వరకు 2,34,531 కేసులు నమోదయ్యాయి. 1,87,400 కేసులతో పెరూ 8వ స్థానికి ఎగబాకింది. దేశంలో ప్రస్తుతం 1,15,942 యాక్టివ్‌ కేసులు ఉండగా, 1,14,072 మంది వైరస్‌ నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ ఒక బులెటిన్‌లో పేర్కొంది. 24 గంటల్లో 4,611 మంది వైరస్‌ నుంచి కోలుకున్నట్లు తెలిపింది. రికవరీ రేటు 48.20 శాతంగా ఉన్నట్లు మంత్రిత్వశాఖకు చెందిన ఒక సీనియర్‌ అధికారి చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 45,24,3147 శాంపిల్స్‌ను పరీక్షచంగా, 24 గంటల్లో 1,37,398 నామూనాలను పరీక్షించినట్లు మంత్రిత్వశాఖ వెల్లడించింది. శుక్రవారం ఉదయం నుంచి మహారాష్ట్రలో కొత్తగా 139 మంది మరణించగా, ఢిల్లీలో 58, గుజరాత్‌లో 35, ఉత్తరప్రదేశ్‌, తమిళనాడులో 12 మంది చొప్పున, పశ్చిమ బెంగాల్‌ 11, తెలంగాణలో 8 మంది, మధ్యప్రదేశ్‌లో ఏడుగురు, రాజస్థాన్‌లో ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు, జమ్మూకశ్మీర్‌, ఒడిశా, పంజాబ్‌, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌లో ఒకరు చొప్పు మరణించారు. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 2,849 మంది కరోనా వైరస్‌కు బలయ్యారు. రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. గుజరాత్‌లో 1,190, ఢిల్లీలో 708, మధ్యప్రదేశ్‌లో 384, పశ్చిమ బెంగాల్‌లో 366, ఉత్తరప్రదేశ్‌లో 257, తమిళనాడులో 232, రాజస్థాన్‌లో 218, తెలంగాణలో 113, ఆంధ్రప్రదేశ్‌లో 73, కర్నాటకలో 57, పంజాబ్‌లో 48, జమ్మూకశ్మీర్‌లో 36, బీహార్‌లో 29 మంది, హర్యానాలో 24, కేరళలో 14 మంది, ఉత్తరాఖండ్‌లో 11 మంది, ఒడిశాలో 8 మంది, జార్ఖండ్‌లో ఏడుగురు, హిమాచల్‌, చండీగఢ్‌ ఐదుగురు చొప్పున, అసోంలో నలుగురు, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, మేఘాలయ, లడఖ్‌లో ఒకరు చొప్పు మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని పేర్కొంది. ఇక రాష్ట్రాల వారీగా కేసులు చూస్తే 80,229 కేసులతో మహారాష్ట్ర తొలి స్థానంలో కొనసాగుతుంది. తమిళనాడులో 28,694 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 26,334, గుజరాత్‌లో 19,094, రాజస్థాన్‌లో 10,084, ఉత్తరప్రదేశ్‌లో 9,733, మధ్యప్రదేశ్‌లో 8,996, పశ్చిమ బెంగాల్‌లో 7,303, కర్నాటకలో 4,835, బీహార్‌లో 4,596, ఆంధ్రప్రదేశ్‌లో 4,303, హర్యానాలో 3,597, జమ్మూకశ్మీర్‌లో 3,324, తెలంగాణలో 3,290, ఒడిశాలో 2,608, పంజాబ్‌లో 2,461, అసోంలో 2,153, కేరళలో 1,699, ఉత్తరాఖండ్‌లో 1,215, జార్ఖండ్‌లో 881, ఛత్తీస్‌గఢ్‌లో 879, త్రిపురలో 692 మందికి కరోనా సోకింది. అదే విధంగా హిమాచల్‌లో 393 మంది కొవిడ్‌ 19 బారిన పడ్డారు. చండీగఢ్‌లో 304, గోవాలో 196, మణిపూర్‌లో 132, పుదుచ్చేరిలో 99, లడఖ్‌లో 97, కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. ఇక నాగాలాండ్‌లో 94, అరుణాచల్‌లో 45, అండమాన్‌ నికోబార్‌, మేఘాలయలో 33 కేసులు, మిజోరాంలో 22, దాదర్‌ నగర్‌ హవేలీలో 14, సి క్కింలో మూడు కేసులు నమోదయ్యాయి. మరో 8,192 కేసులుకు సంబంధించి రాష్ట్రాలు వెల్లడిస్తాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది.

DO YOU LIKE THIS ARTICLE?