సన్‌రైజర్స్ లక్ష్యం 163
ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా గురువారం స న్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ముంబయిను కట్టడి చేస్తుంటే.. ఓపెనర్ డికాక్ (69 నా టౌట్; 58 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మా త్రం అద్భుతమైన హాఫ్ సెంచరీతో తమ జట్టును ఆదుకున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. ముంబయి సారిథి రోహిత్ శర్మ ధాటిగా ఆడతూ స్కోరుబోర్డును పరిగెత్తించాడు. కానీ ఖలీల్ అహ్మద్ తెలివైన బంతితో రోహిత్ శర్మ (24; 18 బంతుల్లో 5 ఫోర్లు)ను పెవిలియన్ పంపాడు. దాంతో ముం బయి జట్టు 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తర్వాత వన్‌డౌన్‌గా వచ్చిన సూర్యకుమా ర్ యాదవ్‌తో కలిసి మరో ఓపెనర్ డికాక్ ముం బయి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు. సన్‌రైజర్స్ బౌలర్లు కట్టు దిట్టమైన బంతులు వేస్తూ పరుగులను నియంత్రించారు. ఈ క్రమంలోనే కీలక ఇన్నింగ్స్ ఆడిన వీరిద్దరూ రెండో వికెట్‌కు 35 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. అనంతరం ప్రమాదకరంగా మారిన ఈ జోడీని మళ్లీ ఖలీల్ విడగొట్టి ముంబయికి మరో షాకిచ్చాడు. ఇతని ధాటికి దూకుడుగా ఆడుతున్న సుర్యకుమార్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 23 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే మహ్మద్ నబీ అద్భుతమైన బంతితో ఎవిన్ లెవీస్ (1)ను పెవియన్‌కు చేర్చాడు. దాంతో ముంబయి 91 పరుగుల వద్ద మూడో వికెట్ వికెట్ చేజార్చుకుంది. తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా వేగంగా ఆడే క్రమంలో 10 బంతుల్లో 18 పరుగులు చేసి భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు డికాక్ మాత్రం ధాటిగా ఆడుతూ ముంబయి స్కోరును ముందుకు సాగించాడు. ఈక్రమంలోనే డికాక్ 48 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ముంబయి విధ్వంసకర బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ (9 బంతుల్లో 10) పరుగులే చేసి ఖలీల్ వేసిన చివరి ఓవర్లో ఔటయ్యాడు. ఇక ఆఖరి వరకు అజేయంగా నిలిచిన డికాక్ (69) పరుగులు చేసి జట్టుకు గౌరవప్రధమైన స్కోరును అందించాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య 3 బంతుల్లోనే ఒక సిక్సర్‌తో 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో ముంబయి 20 ఓవర్లలో 162/5 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ నబీ తలో వికెట్ దక్కించుకున్నారు. రషీద్ ఖాన్‌కు వికెట్లు లభించకపోయినా పొదుపుగా బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. రషీద్ నాలుగు ఓవర్లలో 21 పరుగులే ఇచ్చాడు.
ఆదుకున్న డికాక్
RELATED ARTICLES