ఆగిన నిధులు… సాగని పనులు

రూ.850 కోట్లకుపైగానే పేరుకుపోయిన ‘డబుల్‌’ ఇళ్ల బిల్లులు
స్తంభించిన ఇళ్ల నిర్మాణ పనులు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాల పనులు స్తంభించిపోయాయి. అవసరమైన నిధులు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. రూ.850 కోట్లకుపైగా బిల్లులు పేరుకుపోయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బిల్లుల విడుదలలో తీవ్ర జాప్యం నెలకొనడంతో కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణం ఆపేశారు. గత మే నెల నుంచి జరుగుతున్న పనులకు బిల్లులు విడుదల అలస్యమవుతోంది. అడపాదడపా రూ.50 నుంచి రూ.100 కోట్లు విడుదల చేయడంతో ఇప్పటివరకు పనులు మందకొడిగా సాగుతూ వచ్చాయి. ఇటీవల బిల్లుల విడుదల పూర్తిగా నిలిపేడంతో పనులు ముందుకుసాగని పరిస్థితులు నెలకొన్నాయి. పనులు కొనసాగించాలా? అపేయాలా ? అనే విషయంలో కాంట్రాక్టర్లు డైలామాలో పడ్డారు. ప్రభుత్వం నిధులు ఎప్పుడు విడుదల చేస్తుందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్ల కాంట్రాక్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లకు టెండర్లు ఆహ్వానించే ముందు కాంట్రాక్టర్లతో మున్సిపల్‌ శాఖమంత్రి కెటి రామారావు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ ఇళ్ల నిర్మాణం సందర్భంలో బిల్లులు సకాలంలో విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాన్ని కాంట్రాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకుపోయారు. ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేయిస్తానని మంత్రి కాంట్రాక్టర్లు, బిల్డర్లకు భరోసా ఇవ్వడంతో టెండర్‌లలో పాల్గొని, ఇళ్ల నిర్మాణం చేపట్టారు. శాసనసభ ఎన్నికల ముందు వరకు ప్రతినెల రూ.500 కోట్ల వరకు పనులకు సక్రమంగానే బిల్లులు మంజూరు చేశారు. పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బిల్లుల మంజూరులో జాప్యం నెలకొనడంతో అప్పటి నుంచి పనుల్లో వేగం తగ్గించారు. శాసనసభ ఎన్నికల ముందు నుంచి బిల్లుల విడుదలలో జాప్యం నెలకొనడంతో నెమ్మదించాయి. బిల్లులు మంజూరు చేయకపోతే పనులు చేపట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇళ్ల నిర్మాణం కోసం కార్మికులకు, ఇతర సామాగ్రికి కాంట్రాక్టర్లు ముందస్తుగా కొంతమొత్తం డబ్బులు చెల్లించారు. పనులు ఒక్కసారి అపేస్తే మళ్లీ ప్రారంభించడం గగనమే అవుతుంది. ముందస్తుగా చెల్లించిన డబ్బులు రాకపోవడంతో పాటు పనులు నిలిచిపోతే తిరిగి ప్రారంభించేందుకు మరోసారి వ్యయం చేయాల్సి వస్తోంది. ఈ క్రమం లో ‘ముందు నుయ్యి వెనక గొయ్యి’ అన్న చందంగా కాంట్రాక్టర్ల పరిస్థితి మారింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో పేదలకు మెరుగైన నివాసం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించి న విషయం తెలిసిందే. ఇళ్ల నిర్మాణ బాధ్యతలను మహానగర పాలక సంస్థ (జిహెచ్‌ఎంసి)కి అప్పగించింది. లక్ష ఇళ్లకు నిర్మాణానికిగాను నగరం నలువైపులా భారీ ఎత్తున భూసేకరణ పూర్తి చేశారు. ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్టర్ల కొరత ఉండటంతో కొన్ని ప్రాం తాల్లో బిల్డర్లకు కూడా నిర్మాణ బాధ్యత లు అప్పగించారు. లక్ష డబుల్‌ బెడ్‌రూ మ్‌ ఇళ్ల నిర్మాణానికి రూ.8వేల కోట్లకు పైగా వ్యయం అవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.3వేల కోట్లు మా త్రమే విడుదల చేసింది. జి+3 నుంచి జి+5, 10 అంతస్తుల వరకు వివిధ ప్రా ంతాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. ఇలా శాసనసభ ఎన్నికల ముందు వరకు పనులు వేగంగా సాగాయి. అయితే ఎన్నికల ప్రక్రియ మొదలైన క్రమంలో నిధులు ఆరకొరగా విడుదల చేయడంతో పను లు మందగించాయి. చాలా చోట్ల స్లాబ్‌ ల నిర్మాణం పూర్తి చేశారు. కొన్ని చోట్ల నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నా యి. ఈ క్రమంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు నిధులు మంజూరు చేస్తే తప్ప పనులు ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. నిధుల విడుదల జాప్యం పనులు స్తంభించిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో డబుల్‌ బె డ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం త్రిశంకు స్వర్గం లో పడింది. ప్రభుత్వం నిధులు మం జూరు చేస్తే పనుల్లో ప్రతిష్టంభన తొలగిపోతోంది. లేకుంటే పనులు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?