ఆకస్మాత్తుగా జ్వరం వచ్చిందా? అశ్రద్ధ చేయవద్దు

బ్యాక్టీరియా, వైరస్‌, పారాసైట్స్‌ లేదా ప్రోటోజాన్‌ సంబంధింత ఇన్‌ఫెక్షన్లతో అకస్మాత్తుగా 100.4 డిగ్రీల ఫారిన్‌ హీట్‌కన్నా అధికంగా జ్వరం వస్తే, అది అక్యూట్‌ ఫెబ్రిల్‌ ఇల్‌నెస్‌ (ఏఎఫ్‌ఐ) కావొచ్చు. దానిని ఎట్టి పరిస్థితులల్లోనూ అశ్రద్ధ చేయరాదు. భారతదేశంలో, ఏఎఫ్‌ఐ సంఘటనలు సంవత్సరమంతా కనిపిస్తూనే ఉంటా యి. అత్యధికంగా వర్షాకాలంలో కనిపించడంతో పాటు గా ఫిబ్రవరి వరకూ అవి కొనసాగవచ్చు. దక్షిణ భారతదేశంలో ఇది మరికొన్ని నెలలు అధికంగా అంటే వేసవిలో కూడా కనిపించేందుకు అవకాశాలున్నాయి. ఎందుకంటే 24 గంటలూ సెంట్రల్‌ ఎయిర్‌కండీషనింగ్‌ నూతన భవంతులలో కనిపించడం కూడా ఓ కారణం. చాలా వరకూ ఏఎఫ్‌ఐ కండీషన్స్‌లో దోమలు వల్ల కలిగే డెంగ్యూ, టైఫాయిడ్‌ ఫీవర్‌, మలేరియా, చికున్‌గున్యా, స్క్రబ్‌ టైఫస్‌, రికెట్సియా, లెప్టోస్పిరోసిస్‌ వంటివి ఉంటాయి. ఈ వెక్టార్‌ బోర్న్‌ రోగాలు రక్తం పీల్చే దోమలు, నల్లులు, ఈగల ద్వారా వ్యాప్తి చెందుతాయి. హార్ట్‌ కేర్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌సీఎఫ్‌ఐ అధ్యక్షులు డాక్టర్‌ కెకె అగర్వాల్‌ మాట్లాడుతూ “వెక్టార్‌ బోర్న్‌ డిసీజెస్‌ అయినటువంటి స్క్రబ్‌ టైఫస్‌ లాంటివి పెరుగుతున్నాయి. సరైన సమయంలో వీటికి చికిత్స అందించకపోతే ఆ రోగులకు పలు అవయవాలు పనిచేయని స్థితిలోకి వెళ్లిపోవచ్చు. చాలా వరకూ ముజాఫర్‌ బ్రెయిన్‌ ఫీవర్‌ మరణాలు స్క్రబ్‌ టైఫస్‌ వల్లనే కలుగుతున్నాయి. అతి పురాతమైన యాంటీబయాటిక్‌ డాక్సీసైక్లిన్‌ నిరూపించబడిన యాంటీ బయాటిక్‌ స్క్రబ్‌ టైఫస్‌ సహా ఏఎఫ్‌ఐకు కారణమయ్యే ఇన్‌ఫెక్షన్లను ఉపయోగపడుతుంది. ఏఎఫ్‌ఐకు ప్రభావంతమైన, సురక్షితమైన చికిత్సావకాశంగా ఫిజీషియన్లు దీనిని పరిగణించాల్సి ఉంది”. అని అన్నారు. చాలా వరకూ పరిస్థితులలో, కేవలం క్లీనికల్‌గా మాత్రమే ఏఎఫ్‌ఐను నిర్ధారించడం సాధ్యం కాకపోవచ్చు. అదనపుల్యాబ్‌ పరీక్షలు కూడా అవసరం కావొచ్చు. పరిశోధనా ఫలితాలు లభ్యమయ్యేవరకూ జ్వరం తగ్గేందుకు బిల్లలు ఇవ్వడంతో పాటుగా సురక్షితమైన ఎంపిరికల్‌ యాంటీబయాటిక్స్‌ను వినియోగించడానికి డాక్టర్లు ఇష్టపడతారు. డాక్సీసైక్లిన్‌కు యాంటీ ఇన్‌ఫ్లేమ్మటరీ, ఇమ్యునో మాడ్యులేటరీ లక్షణాలు ఉన్నాయి. డెంగ్యూ జ్వరంలో యాంటీ వైరల్‌ పాత్రనూ పోషిస్తుంది.
ఈ దిగువ అంశాలకు తప్పనిసరిగా పోషిస్తుంది.
1.దోమ కుట్టకుండా వలలు, మస్కిటో రిపెల్లంట్స్‌ ఉపయోగించడంతో పాటుగా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా ఫ్యాంట్లు, షర్టులు ధరించాలి.
2.ఇంటి లోపల, బయట పరిశుభ్రత పాటించాలి
3.జ్వరం వచ్చినప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి
4. ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా మందులు వాడరాదు.

DO YOU LIKE THIS ARTICLE?