ఆంధ్రా కాంట్రాక్టర్ల కోసమే…

అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఆగస్టు 20 తర్వాత తేదీకి వాయిదాప్రతిపానపై
ప్రజాపక్షం / హైదరాబాద్‌ : ఆంధ్రా కాంట్రాక్టర్లతో కుమ్ముకైన ముఖ్యమంత్రి, వారి మేలుకోసమే ఆగస్ట్‌ 5న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఆగస్టు 20 తర్వాత తేదీకి వాయి దా ప్రతిపాదన చేస్తున్నారని ఎఐసిసి కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చే వేల కోట్ల కమీషన్లకు కక్కుర్తిపడి, తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రా కాంట్రాక్టర్లకు తాకట్టు పెడుతున్నారన్నారు. ఆన్‌లైన్‌ మీడియా సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ర్టం మే 5న జి.ఒ 203 ద్వారా కష్ణా బేసిన్‌ నీళ్లను పెన్నా బేసిన్‌కు తరలించేందుకు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగులేటర్‌ సా మర్ధ్యం పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రతిపాదన చేసినప్పుడు సరిగ్గా స్పందించని ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకోసం జులై 15న టెండర్లు పిలిచినప్పుడు కూడా మౌనంగా ఉన్నారని గుర్తుచేశారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి రాయలసీమను రతనాలసీమగా మార్చాలనే ముఖ్యమంత్రి కుట్రలో భాగమేనని అన్నారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను, అధికారులను కలవని, సెక్రటేరియట్‌కే రాని, ఫార్మ్‌ హౌస్‌లో మత్తునిద్ర పోయే ముఖ్యమంత్రికి అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌కి పోయే సమయం, తీరిక లేదా అని ప్రశ్నించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు టెండర్లు సమర్పించే చివరి తేది ఆగస్ట్‌ 10 అని, టెండర్ల ఖరారు తేదీ ఆగస్ట్‌ 19 అని , ఈ నేపథ్యంలో ఆగస్ట్‌ 20 తర్వాత అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం పెట్టి నా ఉపయోగం ఏమీ లేదన్నారు. టెండర్‌ ప్రక్రియ కు అంతరాయం కలగకుండా, టెండర్లు ఖరారు అయ్యేంతవరకు తగు సమయం ఇయ్యాలనే ముఖ్యమంత్రి కుటిల పన్నాగం అని దుయ్యబట్టారు. కృష్ణా నది యాజమాన్య బోర్డు ఇచ్చే ఆదేశాలను ఆంధ్రప్రదేశ్‌ గతంలో బేఖాతరు చేసిందని, ఇప్పుడు ఇచ్చిన ఆదేశాలను కూడా ఆంధ్రా ప్రభుత్వం పట్టించుకోదని, మనకు కేవలం అపెక్స్‌ కౌన్సిల్‌లోనే న్యాయం జరగాలని అ న్నారు. ఒకవేళ టెండర్‌ ప్రక్రియ ముగిసి, ఆగస్ట్‌ 19న టెండర్లు ఖరారైతే, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెళ్లి మరీ పనులు కినసాగించే వెసులుబాటు ఉంటుందని వంశీచంద్‌రెడ్డి హెచ్చరించారు.ముఖ్యమంత్రి కెసిఆర్‌ బాధ్యతగా వ్యవహరించి టెండర్ల దాఖలుకు చివరి ఆగస్ట్‌ 10 లోపే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేయించి, రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్‌ ప్రక్రియ ను అడ్డుకొని, రద్దు చేయించాలని డిమాండ్‌ చేశారు.తెలంగా ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రతిపాదించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లలో పాల్గొనే కాంట్రాక్టర్లను తెలంగా ణ రాష్ర్టంలో బ్లాక్‌ లిస్టులో పెట్టి, మన రాష్ర్టంలో వారికి ఉన్న కాంట్రాక్టులన్ని రద్దుచేసి, ముఖ్యమంత్రికి తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు.లేనిపక్షంలో ముఖ్యమం త్రి కుట్రని బహిర్గతం చేసి, ప్రజాకోర్టులో ముద్దాయిగా నిలబెడతామని హెచ్చరించారు.

DO YOU LIKE THIS ARTICLE?