‘కంటైన్మెంట్’ జోన్లలో మరింత కట్టుదిట్టం
‘జెట్టింగ్’ యంత్రాలతో పారిశుద్ధ్యం
ఇంటికే నిత్యావసర సరుకుల సరఫరా
జిహెచ్ఎంసి పరిధిలో నిరంతర ఇంటర్నెట్ సేవలు
ప్రభుత్వ క్వారంటైన్ల పర్యవేక్షణ బాధ్యత కలెక్టర్లదే
ప్రతి రోజూ ‘ఫీవర్ సర్వే’
‘కంటైన్మెంట్ ’మార్గదర్శకాలను పాటించండి
పట్టణాలకు మున్సిపల్ శాఖ ఆదేశం
ప్రజాపక్షం/హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ‘కంటైన్మెంట్’ జోన్ ప్రాంతాలను అష్టదిగ్బంధం చేయనున్నారు. ఈ జోన్ పరిధిలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కంటైన్మెంట్ జోన్‌ను ఎనిమిది అడుగుల వరకు పర్మినెంట్‌గా ఉన్న బారికేడ్స్‌ను ఏర్పాటు చేసి ఆ జోన్ పరిధిలోనికి వెళ్లేందుకు ఒకటే మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. కంటైన్మెంట్ జోన్‌కు ఒక నోడల్ బృందంతో పాటు సర్వైలెన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని, కంటైన్మెంట్ జోన్‌కు ఒక జోనల్ కమిషనర్, మూడు నుండి నాలుగు కంటైన్మెంట్ జోన్లకు ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షించాలి. కంటైన్మెంట్ ప్రాంతాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. దీనిని అన్ని మున్సిపాలిటీలు కఠినంగా పాటించాలని మున్సిపాల్ శాఖ ఆదేశించింది. ఒక ప్రాంతంలో ఒకటికి మించిన కరోనా పాసిటీవ్ కేసులు నమోదయితే ఆ ప్రాంతంలో సుమారు 250 మీటర్ల వరకు కవర్ చేసేలా చూడాలని మార్గదర్శకాల్లో సూచించారు. నోడల్ బృందంలో డిసి లేదా ఎస్ఇ, ఎసిపి స్థాయి అధికారు లు ప్రతినిధులుగా ఉండాలి.అలాగే ఇన్స్పెక్టర్ లేదా ఎస్ఐ, ఎఎస్ఐ ర్యాం క్ పోలీసు అధికారి ఉండాలి. ఒక ఎంటమాలజిస్ట్, బిల్ కలెక్టర్, పారిశుద్ధ్య సిబ్బంది కూడా నోడల్ బృందంలో ఉండేలా చూసుకోవాలి. సర్కిల్, జోనల్ స్థాయి సర్వైలెన్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే కంటైన్మెంట్ జోన్ పరిధిలో ఉన్న సిబ్బంది, అధికారులు వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉపయోగించాలి. కంటైన్మెంట్ జోన్ పరిధిలోని ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను వారి ఇంటికే మధ్యాహ్నం 12గంటల వరకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి పాలు, నిత్యావసర వస్తువుల సరఫరా చేసే నాలుగు షాపులు, కూరగాయాల షాపులతో కంటైన్మెంట్ జోన్ నోడల్ బృందం ఒప్పందం చేసుకోవాలి. సరుకులను అం దించే వ్యక్తి ఫోన్‌నెంబర్‌ను అక్కడి ప్రజలకు తెలిసేలా కరపత్రాలను పంపి ణీ చేయాలి. ప్రతి రోజూ పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ వంటి పనులు జరిగేలా సర్వైలెన్స్ బృందం చూసుకోవాలి. వైద్య బృందం ఎప్పటికిప్పుడు ఫివర్ సర్వే చేపట్టాలి.
ప్రతి కంటైన్మెంట్ జోన్లో ‘జెట్టింగ్’ పారిశుద్ధ్యం :ప్రతి కంటైన్మెంట్ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిమిత్తం రెండు ‘జెట్టింగ్ మిషన్లు’ ఏర్పాటు చే యాలి. స్పెయింగ్ చేయాలి. దీనిని ఉపయోగించేలా అక్కడి సిబ్బందికి శిక్ష ణ ఇవ్వాలి. ప్రతి రోజూ ఫివర్ సర్వే చేపట్టడంతో పాటు ప్రతి మూడు రోజులకు వాటిని ప్రతి నోడల్ అధికారి పర్యవేక్షించాలి. జోన్ పరిధిలో పాజిటీవ్ కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. పాజిటీవ్ కేసులు అని తేలితే వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించాలి.అలాగే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి వెంట నే ప్రభుత్వ క్యారంటైన్ ప్రాంతాలకు తరలించాలి.(నిజామియా టిబ్బి చార్మినార్, నేచర్ కేర్ హాస్పిటల్ బేగంపేట, సరోజిని ఐ హాస్పిటల్ మెహిదీపట్నం, ఆయుర్వేద మెడికల్ కాలేజ్ అమీర్‌పేట, గవర్నమెంట్ హోమియోపతి కాలేజ్ రామంతాపూర్, కింగ్‌కోఠి హాస్పిటల్)కాగా ప్రభుత్వ క్యారంటైన్లను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాల్సి ఉంటుంది.అనుమానితులకు ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు నిర్వ హిస్తున్నారా లేదా చూడాలి.కరోనా పాసిటీవ్ కేసు నమోదవుతే మాత్రం వెంటనే వారిని గాంధీ ఆస్పత్రికి తరలించాలి.
జిహెచ్ఎంసి పరిధిలో నిరంతర ఇంటర్నెట్ సేవలు : జిహెచ్ఎంసి పరిధిలో ఆయా కేసుల ఆధారంగా కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలి. ప్రధానంగా ఇంటర్నెట్ సర్వేసులలో అంతరాయం లేకుండా నిరంతర సేవలు అందేలా చూసుకోవాలి.జోనల్ కంట్రోల్ రూమ్‌తో పాటు ప్రతి రోజూ మానిటరింగ్ నివేదికను అందజేయాల్సి ఉంటుంది. పోలీసు అధికారులు ఈ ప్రాంతంలో సిసిటివిల ఏర్పాటు, అందరితో సమన్వయంగా ఉం డాలి.సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఏమైనా కేసులు ఉంటే వారి వివరాలను వెంటనే కంటోన్మెంట్ బోర్డు సిఇవోకు సమాచారం ఇవ్వాలి.