నిర్వాహకుల కుటుంబీకులే సభ్యులు?
అధునాతన ‘ఫైవ్‌స్టార్’ క్లబ్ నిర్మాణం
కోట్ల రూపాయల కుంభకోణం!
ప్రజాపక్షం/హైదరాబాద్: హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీలో తీవ్ర ఆర్థిక అవకతవకలతో పాటు సొసైటీ నిర్వాహకుల ఆర్థిక దుబార, తమ కుటుంబ సభ్యులను సొసైటీ సభ్యులుగా ఏక మొత్తంలో చేర్పించి, సొసైటీకి చెందిన ఆదాయంలో కోట్ల రూపాయాలను కాజేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న విద్యా సంస్థలలో ఒకటైన లాల్‌బహదూర్ కాలేజీ వరం గల్, వనిత మహా విద్యాలయం హైదరాబాద్ విద్యాల యాల కార్యదర్శి, ఉపాధ్యక్షునిగా పని చేసిన బి.రవీంద్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎసిబి దాడులు ప్రారంభమయ్యాయి. మే 25వ తేదీన ముఖ్య మంత్రికి ఆయన ఫిర్యాదు చేశారు. సొసైటీ ఉద్దేశం, లక్ష్యానికి భిన్నంగా నిజాం క్లబ్, ఫతేమైదన్ క్లబ్, సికిం ద్రాబాద్ క్లబ్ తరహా కోట్ల రూపాయాలు వెచ్చించి అత్యంత ఆధునీకంగా ‘ఫైవ్ స్టార్’ క్లబ్‌ను నిర్మించడం, వేతనాలు లేకుండా సేవలను అందించాల్సిన సొసైటీ సభ్యులు “ప్యాకెట్”ఖర్చుల పేరుతో కోట్ల రూపాయాలు కాజేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. దాదాపు రెండు వందల మంది సభ్యులు ఉన్న ఈ సొసైటీలో ఒకే పర్యాయం 60 మందిని కొత్తగా చేర్చుకోవడం, ఇందు లో సొసైటీ కార్యదర్శిగా వ్యవహారిస్తున్న వ్యక్తికి సంబం ధించిన కుటుంబ సభ్యులు, వారి బంధువులు, స్నేహి తులు 28 మంది ఉన్నారు. ఈ వ్యవహారం 2019 మే 25న జరిగింది. కొత్తగా చేర్చిన సభ్యత్వంలో అప్పటి సొసైటీ అధ్యక్షులు,మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుమారుని పేరు కూడా చోటుచేసుకున్నది. గతంలో సొసైటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒకే పర్యాయం ఇంత మంది కొత్త సభ్యులను చేర్చకోలేదు. విద్యా సంస్థలకు కేటాయించిన డబ్బులు, విద్యా సంస్థలకు వచ్చిన గ్రాంట్లు, చట్టవిరుద్ధంగా ఫీజుల రూపంలో వసూ లు చేసిన మొత్తాల్లో అత్యధికంగా దుర్వినియోగమై నట్టు, అందులో కీలక పాత్రధారిగా సొసైటీ కార్యదర్శి ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ అంశాలపై ఇప్పటికే ఎగ్జిబిషన్ సొసైటీ మీద హైకోర్ట్‌లో కేసు (రిట్ పిటిషన్ నంబర్ 247/2020) నమోదైంది. కంపెనీ కింద నమోదైన సొసైటీకి దశాబ్ధాల క్రితం 24 ఎకరాల 65 సెంట్ల ఎకరాల స్థలాన్ని నాటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ స్థలం ఇప్పుడు బంగారాన్ని మించి పోయింది. రూ. 20వేల కోట్ల విలువ చేస్తుందని చెబు తున్నారు. ఉస్మానియా గ్రాడ్యూయేట్ అసోసియేషన్ ఆధ్వర్యాన నెలకొన్న ఈ ఎగ్జిబిషన్ సొసైటీలో ఉండా ల్సిన విద్యా వేత్తలు, సంఘ సేవకులు, శాస్త్రవేత్తలు కను మరుగయ్యారు. ఈ సొసైటీ కొన్ని కుటుంబాల ఆస్తిగా మిగిలిపోయినట్టు ఆరోపణలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం కింద సొసైటీ నిర్వహణపైన పలు వాస్త వలు వెలుగులోకి వచ్చాయి. అయితే రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు లోనైన ఈటల రాజేందర్‌ను నింది తునిగా చేయడానికి ఉద్దేశించే ఈ దర్యాప్తు సాగుతు న్నట్టు రాజకీయ వేతల్లో చర్చ సాగుతోంది. ఈ విషయం ఏ వైపునకు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.
అవకతవకల నుమాయిష్
RELATED ARTICLES