అర్అర్అర్ : ‘రౌద్రం రణం రుధిరం’

భారీగా అంచనాలు పెంచిన రాజమౌళి
భారీ చిత్రాల దర్శకుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టిఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఓ భారీ ముల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ‘ఆర్ఆర్ఆర్’ వర్కింగ్ టైటిల్ తో శారవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంపై అభిమానునులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే దర్శకుడు ఈ చిత్రం నుంచి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ మధ్యాహ్నం 12 గంటలకు విడుదలైంది. మోషన్ పోస్టర్ తో రాజమౌళి మరోసారి మ్యాజిక్ రిపీట్ చేశాడు. మోషన్ పోస్టర్ తో రాజమౌళి సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాడు. 21 సెకండ్ల నిడివితో విడుదలైన మోషన్ పోస్టర్ తో ఆర్ఆర్ఆర్ టైటిల్ రివీల్ అయింది. రౌద్రం రణం రుధిరం టైటిల్ ను రాజమౌళి ఈ సినిమాకు ఫిక్స్ చేశాడు. రాజమౌళి ఎన్టీయార్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలో పరుగెత్తుతూ విడుదలైన మోషన్ పోస్టర్ తో ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. 2020 జనవరి 8వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమాకు టైటిల్ లోగోతో కూడిన మోషన్ పోస్టర్ తో రాజమౌళి పబ్లిసిటీ మొదలుపెట్టాడు. ఈ సినిమాతో రాజమౌళి సరికొత్త ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఇప్పటివరకూ ఆర్ఆర్ఆర్ సినిమా టైటిల్ గురించి రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ఎంతో బాగుందని మెగా అభిమానులు, నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా రాజమౌళి ఈరోజు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. మోషన్ పోస్టర్ తోనే సినిమాపై హై రేంజ్ లో అంచనాలు పెంచిన రాజమౌళి టీజర్, ట్రైలర్ తో ఏ స్థాయిలో అంచనాలు పెంచుతాడో చూడాల్సి ఉంది.

DO YOU LIKE THIS ARTICLE?