HomeOpinionEditorialఅమిత్ షా కోర్టు ధిక్కార ప్రసంగం

అమిత్ షా కోర్టు ధిక్కార ప్రసంగం

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుమతించి మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన సమానత్వహక్కును పరిరక్షించాలనే సుప్రీంకోర్టు తీర్పు విషయంలో రెండు నాల్కల ధోరణి అనుసరిస్తున్న బిజెపి, అత్యున్నత న్యాయస్థానం తీర్పును అమలు జరపటానికి ప్రయత్నిస్తున్న కేరళ ఎల్ ప్రభుత్వంపై నిప్పులు చెరగటం హాస్యాస్పదం. కన్నూర్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం పనిమీద ప్రత్యేక విమానంలో అరుదెంచిన బిజెపి అధ్యక్షుడు అమిత్ ఆలయ సాంప్రదాయం, ఆచారాలు పరిరక్షించటానికి సంఘ్ సర్వశక్తులు ఒడ్డుతుందన్నారు. అక్టోబర్ 17 నుండి 22 వరకు మాసపూజలకై శబరిమల ఆలయం తెరిచినప్పుడు పంబ, నీలక్కల్, శబరిమల సన్నిధానం వద్ద మహిళా భక్తులను, హక్కుల కార్యకర్తలను అడ్డగించి హింసకు దిగిన ‘భక్తుల ముసుగు’లోని బిజెపి, ఆర్ నాయర్ సర్వీసు సొసైటీ కార్యకర్తలను అనంతరం పెద్ద ఎత్తున అరెస్టు చేయటాన్ని ‘నిప్పుతో చెలగాటం’గా షా హెచ్చరించారు. సామాజిక దురాచారాలను రూపుమాపే పేరుతో అయ్యపస్వామి ఆలయ ఆచారాలు, సాంప్రదాయాల్లో జోక్యం చేసుకోవటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా ఉన్న బిజెపి కార్యకర్తలు భక్తులకు అండగా శిలలా నిలబడతారని అయ్యప్ప భక్తులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. “శబరిమల ఆలయ సాంప్రదాయాలను పరిరక్షించే తంత్రికుటుంబ బహిరంగ ముఖంగా ఉన్న రాహుల్ ఈశ్వర్ అంతకు క్రితం ప్రకటించిన నిరసనకారుల ప్లాన్‘బి’తో షా హెచ్చరికను కలిపి చూడాలి. ‘నిప్పును నిప్పుతో’, ‘అపవిత్రతను అపవిత్రతతో’ అడ్డుకోవటం ఆ ప్రణాళిక. నవంబర్ ఆలయాన్ని తెరిచినపుడు మహిళల ప్రవేశానికి ప్రయత్నిస్తే గర్భగుడిలో గాయం చేసుకుని రక్తంబొట్లు చిందిస్తామని, దాంతో ఆలయం మూతపడుతుందని అతడు వెల్లడించాడు.
సుప్రీంకోర్టు తీర్పుపట్ల నిజమైన భక్తుల అసంతృప్తిని, వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు. ఏ సాంఘిక సంస్కరణ అయినా చాందసుల ప్రతిఘటన ఎదుర్కొనక తప్పదు. కాని కేరళలో బిజెపి, ఆర్ ఎన్ సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ సంఘటిత నిరసనను రేకెత్తించారు. దాన్ని నగరవీధుల నుంచి శబరిమల కొండలకు తీసుకెళ్లారు.
రామాలయం పేరుతో ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టు సంపాదించినట్లు కేరళ సహా దక్షిణాదిరాష్ట్రాల్లో హిందూ మనోభావాలను ఓట్లుగా మార్చుకునేం దుకు బిజెపి, ఆర్ శబరిమల సమస్యను ఉపయోగించుకుంటు న్నాయి. ఈ క్రమంలో అవి కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పును సమర్థిస్తున్నామని బిజెపి నాయకులు ఢిల్లీలో అంటారు. కేరళలో వారి నాయకులు దాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేబడతారు. ఆందోళన అయ్యప్ప భక్తులదేగాని తమ కార్యకర్తలది కాదని బుకాయించిన బిజెపి నాయకులు కేరళ ప్రభుత్వం తమ కారకర్తలను అరెస్టు చేస్తోందని ఖండిస్తున్నారు.
అదే సమయంలో షా ప్రసంగం సుప్రీంకోర్టును, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నట్లుగా సాగింది. హిందూమతం ఎల్లప్పుడూ మహిళలను గౌరవిస్తుంది, పూజిస్తుంది అంటూనే, ఆలయాల్లో ప్రార్థనలు చేయటానికి హక్కులు ఇవ్వటం ద్వారా లింగసమానత్వం చేకూరదన్నారు. “హిందూమతం లో భిన్న ఆచారాలున్నాయి. మహిళలను మాత్రమే అనుమతించే ఆలయాలు దేశంలో అనేకం ఉన్నాయి. పురుషులను మాత్రమే అనుమతించే ఆలయాలున్నాయి. అమలు జరపని కోర్టు తీర్పులున్నాయి. ఉదాహరణకు జల్లికట్టు, మసీదులపై లౌడ్ నిషేధం. కోర్టులు ఆచరణసాధ్యంకాని ఆదేశాలివ్వరాదు. అమలు జరిగే ఆదేశాలే ఇవ్వాలి” అని షా అన్నారు.
తమ హిందూత్వ ఎజండా అమలుకు కోర్టులు అడ్డువచ్చినా వాటిని ధిక్కరించాలన్నదే బిజెపి, ఆర్ రాజ్యాంగ విరుద్ధ వైఖరి. అయోధ్య స్థల వివాదం సుప్రీంకోర్టు ముందున్నా పార్లమెంటు చట్టంద్వారా రామాలయ నిర్మాణాన్ని అనుమతించాలని ఆర్ అధినేత మోహన్ భాగవత్ ఇటీవలనే మోడీ ప్రభుత్వాన్ని కోరటం అటువంటిదే. శబరిమల విషయంలో షా ప్రసంగం మరో ఉదాహరణ. శబరిమల సమస్యలో ముఖ్యమంత్రి విజయన్ దోషిగా చిత్రిస్తూ రాష్ట్ర బిజెపి నాయకులు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పును వమ్ముచేస్తూ రాష్ట్రప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసినా, లేక రివ్యూ పిటిషన్ దాఖలు చేసినా శబరిమల వివాదం సమసిపోతుందని పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ అటువంటిది చేయాలంటే పార్లమెంటు మాత్రమే చేయగలదు. ఈ నాయకులు మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరు? వారికి కావలసింది న్యాయంకాదు. రాష్ట్రప్రభుత్వాన్ని అపఖ్యాతి పాల్జేసి రాజకీయంగా ఓట్లు కొల్లగొట్టటం. కొందరు కాంగ్రెస్ నాయకులూ వారికి వంతపాడటం దురదృష్టకరం. కేరళలాంటి లౌకిక రాష్ట్రంలో వీరి ఆటలు సాగవు. అయినా వారి దుష్టపన్నాగాల పట్ల ప్రజాతంత్ర, లౌకికశక్తులు అప్రమత్తంగా ఉండాలి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments