”గుంపులుగా తిరిగితే కరోనా వైరస్ సోకుతుంది. దాని జీవితకాలం 14 రోజు లు. మరో 7 రోజుల్లో పూర్తి గా నశిస్తుంది. సంక్రమణ సంకెళ్ళు తెగుతాయి”….ఈ నమ్మకంతో 21 రోజుల దేశ బందీ ఆదేశం ఇచ్చారు ప్రధాని. ఇది మోడీ సమర్థనా సమయం. ప్రశ్నాసమయం కూడా. ప్రభుత్వ యంత్రా గాల ద్వారా ప్రజలకు శాస్త్రీయ సమాచారం అందించాలి, చైతన్యపరచాలి. మాధ్యమాల తప్పుడు సమాచారాన్ని అరికట్టాలి. ప్రభుత్వం ఇవేమీ చేయలేదు. ప్రతిపక్షాలను సంప్రదించలేదు. ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తూనే ప్రజల ను విశ్వాసంలోకి తీసుకుంటున్నట్లు నటించింది. మధ్య ప్రదేశ్ రాజకీయం ముగిశాక నిర్బంధం మొదలెట్టింది. అప్పటి దాకా 700ల మంది పార్లమెంట్ సభ్యుల సమావేశం కొనసాగింది. ప్రధాని, మంత్రులు సంబరాలు, విందులకు హాజరయ్యారు. కేంద్రమంత్రులు అశాస్త్రీయం గా వ్యవహరించారు. ఆవుమూత్రం తాగమన్నారు. ఆవు పేడ పొగ వేయమన్నారు. ఈ రాజ్యాంగరాహిత్యాన్ని ప్రధాని ఖండించలేదు. ఒక్కరోజు జనతా కర్ఫ్యూతో ప్రజల ఉద్రేకాలతో ఆడుకున్నారు. చప్పట్ల ప్రశంస ‘గంటోలజి’తో ప్రజలను హాస్యగాళ్లుగా మార్చారు. ప్రపంచ మూర్ఖత్వ బహుమతికి పోటీపడ్డారు. అంధకార భవిష్యత్తుకు వంతెన కట్టారు. భారత ప్రభుత్వం అబద్దాలకు, ఆశాస్త్రీయతలకు పేరు మోసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగతాళి చేసింది. ఈ ప్రక్రియకు ఇన్ఫోడెమిక్ (వజూఱసవఎఱష శీట షతీశీఅస్త్ర ఱఅటశీ తీఎa్‌ఱశీఅ) అని పేరుపెట్టింది. 80 రోజుల ఆలస్యంతో 137 కోట్ల మంది భారత్ బంద్ జూదంతో 20% విశ్వ మానవత్వం గహబందీ అయింది. ఆర్థికమంత్రి తొలి రాయితీలు వాణిజ్యవర్గాలకే. 1.7లక్షల కోట్ల మలిరాయితీ పేదలకు…మనిషికి రోజుకు రూ.23.60లు వస్తుంది ళి(1.7/80)/90 రోజులు. ఈ సాయంపై గతానుభవాల అనుమానాలున్నాయి. 20.5 వేల కోట్ల కేరళ సాయం 3.51కోట్ల కేరళీయులకు మనిషికి రూ.5,840లు వస్తుంది.
అనిశ్చిత ప్రపంచం ముందెన్నడూలేని మానసిక వైకల్యానికి చేరింది. విరామ సమాజం వినాశకరం. పని పాటలు, వ్యాపకాలు, ఉల్లాసవినోద కాలక్షేపాలు కోల్పో యినవారు దురలవాట్లకు లోనవుతారు. గహనిర్బంధం కొత్త సమస్యలు సష్టిస్తుంది. నిద్రలేమి, ధూమమద్య పానాలు, మాదకద్రవ్యాలు, హింస, ఆందోళన, ఒత్తిళ్ళు పెరుగుతాయి. ఇంట్లోనే అసాంఘికచర్యలు అలవాటు అవుతాయి. ఊహించని దేశబందీతో పలువురు భార తీయులు దేశవిదేశాల్లో ప్రయాణ సౌకర్యాలు, డబ్బుల ఇబ్బందులతో ఇరుక్కుపోయారు. కొద్దిపాటి మానసిక ఆరోగ్యక్షీణత కూడా భారతీయులను తీవ్ర వైకల్యం, వ్యాకులతలకు గురిచేస్తుంది. ఒత్తిళ్ళు, ఆందోళన, సంపాద న కోల్పోవటం, ఐనవాళ్లకు దూరంగా ఉండటం మానసిక, భావోద్రేక సమతుల్యతలను దెబ్బతీస్తాయి. నిజానికి వైరస్ సంక్రమణ సంకెళ్ళు తెంచటానికి దైహికదూరం కీలకం. సామాజిక దూరం అక్కరలేదు. తీవ్ర ఆందోళనలో సామాజిక దూరం దుష్ఫలితాలిస్తుంది. నిర్బంధ ఏకాంతం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఆందోళన సమయంలో సామాజిక వేర్పాటు కంటే సాంఘిక కలివిడితనం, సామాజిక మద్దతు, సహాయ సహకారాలు అవసరం. దైహిక దూరం పాటిస్తూనే సామా జిక సంఘీభావం సాధించవచ్చు. ఫోన్లో మాట్లాడవచ్చు. సామాజిక మాధ్యమాల్లో సంబంధాలు నెరపవచ్చు. పొరుగువారి కష్టనష్టాల్లో పాలుపంచుకోవచ్చు. ప్రజలు 24 గంటల వైరస్ వార్తలు వినటం మానాలి. విశ్రాంతి తీసు కోవాలి. శాస్త్రీయ వైద్యుల మాటలు ఆలకించాలి. పౌష్టి కాహారం తినాలి. మానసిక ఉల్లాస కార్యక్రమాలు చేయా లి. మనశ్శాంతిగా నిద్రపోవాలి. ఇంటి నుండి పనిచేసుకునే వెసులుబాటు గలవారు మనసుపెట్టి ఉద్యోగం చేయాలి. బంధుమిత్రులు, సహోద్యోగులతో మాట్లాడాలి. రోజు కూలీల కష్టాలు తీర్చే ప్రయత్నం చేయాలి. సాంకేతికతలు బాగా వాడలేని వారికి, పెద్దవారికి ఫోన్లో, వాట్సాప్ ద్వారా సాయపడాలి. పార్కులు పగలంతా తెరిచి ఉంచాలి. వంతు ల వారీగా పరిమిత సంఖ్యలో పెద్దలను అనుమతించాలి. పూరిగుడిసెల్లో, మురికివాడల్లో ఇబ్బంది పడుతున్న 23 కోట్ల మంది పేదలకు పార్కుల, మరుగుదొడ్ల అదష్టం కల్పించాలి. మురికికూపాల్లో 24 గంటల నిర్బంధం ప్రభుత్వ నేరం. నిత్యావసరాల పంపిణీకి పరిమిత సమ యాల్లో సంతలు తెరవాలి. అక్కడ వినియోగదారులు కరో న బారిన పడరాదు. దైహిక దూరం పాటించటానికి దూర దూరంగా గుండ్రాలు చుట్టి వాళ్ళు అందులో నించొని వస్తువులు కొనే ఏర్పాటు చేయవచ్చు. ఈ పద్దతిని కాంట్రా క్ట్ ట్రేసింగ్ అంటారు. 2014లో ఆఫ్రికాలో ఎబోలా వైరస్ వ్యాపించినపుడు ఈ పద్దతి పాటించారు.
స్వీడెన్ తీరే వేరు. 25వ తేదీకి అక్కడ 2,526 మందికి కరోనా సోకింది, 40 మంది చనిపోయా రు. తెలియని దశలో స్వీడెన్ విద్యార్థులు అంతర్జా తీయ ఆటల పోటీలకు ఇటలీ వెళ్లారు. అక్కడ వారికి ఈ వైరస్ అంటుకుంది. స్వీడెన్‌లో వైద్యం ఉచితం. ఆరోగ్యవైద్య రంగాలు ప్రభుత్వం నిర్వహి స్తుంది. ఆరోగ్యం, రోగనిరోధం మీద దష్టి పెడు తుంది. చికిత్స అవసరం తక్కువ. ఒక పిల్లాడికి ఆటలమ్మ పోస్తే పిల్లలందరినీ బడికి పిలిచి పార్టీ చేస్తారు. ఎంతమందికి ఆటలమ్మ అంటుకున్నా అందరికీ రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇప్పుడు కూడా పాఠ శాలలు, ఆహారాలయాలు, పానశాల లు తెరిచే ఉన్నాయి. బయట గాలిలో తిరగమని ప్రభుత్వం ప్రజలను ప్రోత్సహిస్తోంది. కాలుష్యరహి త వాతావరణానికి స్వీడెన్ ప్రసిద్ధి. కరోనా కట్టడికి స్వీడెన్ ప్రభుత్వ నిర్ధారిత కొలబద్దలు, శాస్త్రీయ నిబ ద్ధ ప్రజాప్రణాళికలు ఉన్నాయి. తప్పనిసరి ఏకాంత వాసాలు, దేశబందీలు, జనతా కర్ఫ్యూలు, చప్పట్ల ప్రశంసలు లేవు. బ్రిటన్, జర్మనీలలో ఇద్దరు గుమి కూడరాదు. స్వీడెన్‌లో 500 మంది సమావేశం కావచ్చు. అనేక ఐరోపా దేశాల్లో కరోన కట్టడితో జనజీవనం స్తంభించింది. స్వీడెన్‌లో మానవత్వం కొనసాగుతోంది. స్వీడెన్ చర్యలు సరైనవేనా అని ”ప్రజాస్వామ్య” పాలకులు అనుమానించవచ్చు. ”సోకడం తగ్గినంత మాత్రాన వైరస్ పోయిందను కోరాదు. రుతువలయాల్లో వైరస్ మరల సంక్ర మించే అవకాశాలు ఎక్కువ. వాక్సిన్, చికిత్స కనుగొనడమే పరిష్కారం.” అని అమెరికా పరి శోధన శాస్త్రవేత్త ఆంథోనీ ఫౌకి అన్నారు. మన మధ్యనున్న కనిపించని వైరస్ వాహకులు ఆలస్యం గా బయటపడతారు. స్వీడెన్ శాస్త్రవేత్తల ఉద్దేశమూ ఇదేనేమో!
కొన్ని భారత రాష్ట్రాల్లో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలి చ్చారు. పోలీసులు వైద్యులు, సంఘ సేవకులనే విధులకు పోకుండా అడ్డుకున్నారు. పేదల ఆకలి పనులు ఆపేస్తు న్నారు. కూటికి జరగనివారు సాయం చేయమని రాజకీయ ”ఆప్తులకు” ఫోన్లు చేస్తున్నారు. ఈ ”సాయం”లోనూ భవిష్యత్తు దోపిడీ పన్నా గాలుంటాయి.
దేశబందీ ప్రభావం పెద్దలకు, పేదలకు వేరువేరు. పెద్దల వినోదం, సుఖాలు, అంతర్జాల, నాజూకు ఫోన్ల వినియోగం పెరుగుతాయి. వ్యాపార లాభాలు తగ్గవచ్చు. ఇవి పెద్ద నోట్లరద్దు కంటే ఎక్కువ కాదు. వినోదాలు లేక మానసిక వికలాంగత ఏర్పడవచ్చు. పేదల రోజు సంపా దన ఆగుతుంది. ప్రభుత్వ సాయం అందితే తింటారు. లేకుంటే ఎండుతారు. కడుపు నింపుకునే పనిలో వీళ్ళు భవిష్యత్తును తాకట్టుపెట్టి బానిసలుగా మారతారు. అప్పు లతో కొన్న వీరి రిక్షాలు, బతుకు సాధనాలను బ్యాంకులు జప్తుచేస్తాయి. పెద్దల, పేదల కష్టాలు రెండింటిలో పాల కుల ప్రయోజనాలున్నాయి. ప్రజల దష్టి సమస్యల నుండి మరలుతుంది. పలు సమీకరణలతో పాలన స్థిరపడు తుంది. మోడీ మరో పుల్వామా హీరో అవుతారు. కరోనా ను సమర్థవంతంగా కట్టడి చేసిన ప్రధానిగా పేరు పొందు తారు. గత పాలకులు దద్దమ్మలుగా చిత్రీకరించబడతారు. ప్రజల కష్టాలు కొనసాగుతూనే ఉంటాయి. ఐనా వారి దష్టిలో మోడీ దేవుడవుతారు. 3 నెల్ల ప్రభుత్వ రాయితీల, ఔషధాల కంట్రోలర్ జనరల్ మాటల ప్రకారం దేశబందీ సుదీర్ఘం కావచ్చు. అప్రకటిత ఆర్థిక ఎమర్జెన్సీగా మార వచ్చు. ప్రశ్నలు, విమర్శల సాకుతో ఆంతరంగిక ఎమ ర్జెన్సీగా రూపాంతరం చెందవచ్చు.
(విశాలాంధ్ర సౌజన్యంతో)