రజనీకాంత్ 170వ చిత్రం అపూర్వమైన కలయికకు వేదికైంది. అగ్ర తారలైన అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ కలిసి 33 ఏళ్ల తర్వాత నటిస్తున్న చిత్రమిది. ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలోని స్టిల్‌ని ఆదివారం విడుదల చేసింది చిత్రబృందం. రజనీకాంత్, అమితాబ్ కలిసి కనిపిస్తున్న ఆ చిత్రం అభిమానుల్ని, సినీ ప్రేమికుల్ని ఎంత గానో ఆకట్టుకుంది. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముంబైలో మొదలైన సంగతి తెలిసిందే. రజనీ, అమితాబ్లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. దాంతో షెడ్యూల్ పూర్తయినట్టు తెలుపుతు చిత్రబృందం ఈ స్టిల్‌ని విడుదల చేసింది. ఇదివరకు ఈ ఇద్దరూ ‘అంధా కానూన్’, ‘హమ్’ తదితర చిత్రాల్లో కలిసి నటించారు