ప్రజాపక్షం/హైదరాబాద్ : జి హెచ్ ఎం సి నెలకొల్పిన అన్నపూర్ణ క్యాoటీన్ లలో గురువారం మధ్యాహ్నం ఉచితంగా దాదాపు 10 వేల మంది కి ఉచిత భోజనం అందించారు.సిబ్బంది కొరతతో నేడు 78 కేంద్రాలు నడిచాయి.హాస్టళ్లలో ఉంటున్న వారు కూడా సమీపంలోని అన్నపూర్ణ కేంద్రాల్లో భోజనం చేశారు శుక్రవారం నుండి మొత్తం 150 కేంద్రాలను తెరవాలని నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు ఆదేశాలతో మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం రాత్రి హుటాహుటిన సీతాఫల్ మండి లో వున్న అన్నపూర్ణ క్యాoటీన్స్ సెంట్రల్ కిచెన్ ను సందర్శించి వాటి నిర్వాహకులు హరే కృష్ణ ఫౌండేషన్ వారితో మాట్లాడారు. రూ 5/-లకే అందిస్తున్న అన్నపూర్ణ భోజనాన్ని ప్రస్తుత లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉచితంగా అందించాలని జి హెచ్ ఎం సి అధికారులను మంత్రి కే టీ ఆర్ ఆదేశించారు.
అన్నపూర్ణ క్యాoటీన్ లలో ఉచిత భోజనం
RELATED ARTICLES