ప్రజాపక్షం/కొత్తగూడెం/పాల్వంచ/ఖమ్మం
భారీ వర్షాలకు ముంపుకు గురై ఇబ్బందులు పడుతున్న గ్రామీణ ప్రజలు అధైర్యపడొద్దని యుద్ధ ప్రా తిపదికన నష్టనివారణ చర్యలు చేపట్టామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలో వర్షా లు, వరదలకు ముంపుకు గురైన ఉల్వనూరు, మందెరకలపాడు, మల్లారం, కిన్నెరసాని, రాళ్ళవాగు, యానంబైలు ప్రాంతాలను సోమవారం కూనంనేని సందర్శించారు. మండల తహసీల్దార్, ఎంపిడిఒ, నీటిపారుదల, వ్యవసాయ, అటవీశాఖ, విద్యుత్, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. మందెరకలపా డు వంతెనకు గండి పడి సుమారు ఏడు ఊర్లకు రాకపోకలు స్తంభించడంతో స్పందించిన కూనంనే ని అధికారులను ఆదేశించడంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. వరద ఉధృతితో నిరుచేరి ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను పరామర్శించి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు, బాధితులకు పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామాలను సందర్శించిన సందర్భంలో దెబ్బతిన్న రోడ్లను, విద్యుత్‌లైన్లను తక్షణమే పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. వరదతాకిడికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ముందస్తు సమాచారం అందించినప్పటికి గ్రామీల సందర్శనకు గైర్హాజరైన వ్యవసాయ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ రోడ్లు, విద్యుత్ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, పంటల నష్టంపై వ్యవసాయ అధికారులు తక్షణమే సర్వేచేపట్టి నివేదికను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించినట్లు తెలిపారు. పర్యటనలో కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, జిల్లా నాయకులు ము త్యాల విశ్వనాధం,వి.పూర్ణచందర్‌రావు, ఏ.సాయిబాబు, బండి నాగేశ్వర్‌రావు, రాహుల్, నాగరాజు, దారా శ్రీను, మన్నెం వెంకన్న, ఆదినారాయణ, అన్నారపు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
ముంపు ప్రాంతాల్లో సిపిఐ బృందం పర్యటన
అధికారుల నిర్లక్ష్యం, అంచనా వేయడంలో వైఫల్యం ఖమ్మం నగరంతో పాటు మున్నేరు పరీవాహాక ప్రాంత ప్రజలు భారీగా నష్టపోయేందుకు కారణమైందని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు ఆరోపించారు. 30, 31 తేదీలలో భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ పలుమార్లు హెచ్చరించినా మున్నేరు ప్రభావిత ప్రాంతాలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని తెలిసి కూడా ప్రజలను అప్రమత్తం చేయలేదని హేమంతరావు తెలిపారు. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ సహా సిపిఐ బృందం పలు ప్రాంతాల్లో పర్యటించింది. వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ, మోతీ నగర్, పంపింగ్ వెల్‌రోడ్డు, ప్రకాష్ నగర్, జలగం నగర్, నాయుడు పేట, రాజీవ్ గృహ కల్ప, నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీ, కస్నాతండా తదితర ప్రాంతాలలో పర్యటించారు. హేమంతరావు మాట్లాడుతూ ప్రజలను అప్రమత్తం చేయకపోవడం వల్ల వరద రావడంతో కట్టు బట్టలతో ఇండ్లు వదిలి బయటకు వచ్చారని కనీసం చేతికి అందే సామాన్లు కూడా తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని హేమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాటి వెంకటేశ్వరరావు, తోట రామాంజనేయులు, మేకల శ్రీనివాసరావు, జిల్లా సమితి సభ్యులు యానాలి సాంబశివరెడ్డి, నూనె శశిధర్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ, భూక్యా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మున్నేరు బాధితులకు ఏఐఎస్‌ఎఫ్ భరోసా
మున్నేరు వరద బాధిత కుటుంబాలకు ఎఐఎస్‌ఎఫ్ ఖమ్మంజిల్లా బృందం భరోసా కల్పించింది. సోమవారం ఖమ్మం నగరం కాల్వొడ్డు వెంకటేశ్వర కాలనీలో వరద ముంపుకు నష్టపోయిన కుటుంబాలకు ఏఐఎస్‌ఎఫ్ బృందం ఆహార పదార్థాలు, మంచినీళ్లు ఇంటింటికి తిరిగి అందజేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్‌ఎఫ్ మాజీ జాతీయ ఉపాధ్యక్షులు రావి శివరామకృష్ణ మాట్లాడుతూ దేశంలో జరిగిన ప్రకృతి విపత్తు సమయాల్లో ఏఐఎస్‌ఎఫ్ బాధితులకు అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ మాజీ నాయకులు పోటు పూర్ణచందర్ రావు, మేకల రవి, ఏఐఎస్‌ఎఫ్ ఖమ్మంజిల్లా సమితి కార్యదర్శి ఇటికాల రామకృష్ణ, జిల్లా నాయకులు రాకేష్, సునీల్, హరికృష్ణ, ప్రతాప్, నరేష్, సాయి, గోపి, ఉమా, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
అధైర్యపడొద్దు
RELATED ARTICLES