HomeOpinionArticlesఅంతా గజిబిజి గందరగోళం

అంతా గజిబిజి గందరగోళం

అసెంబ్లీ ఎన్నికల కాలం సమీపిస్తుండగా, మధ్యప్రదేశ్ ఎన్నికల దృశ్యం గజిబిజి గందర గోళంగా తయారవుతున్నది. ఎన్నికల పోరాటం ప్రధానంగా పాలక బిజెపికి, కాంగ్రెస్, బిఎస్పి, ఎస్పి కూడిన కూటమికి మధ్య ఉంటుందని నెలరోజుల క్రితం భావించబడింది. అయితే బిఎస్ అధినాయకురాలు మాయావతి ప్రకటన తో అటువంటి దృశ్యం చెదిరిపోయింది. చత్తీస్ ఘర్ కాంగ్రెస్ నుండి వేరై సొంతపార్టీ (జన కాంగ్రెస్) ఏర్పాటు చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగితో ఆమె చేతులు కలిపారు. జోగి కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు చేయటంతో, బిఎస్పి మధ్యప్రదేశ్ కూడా కాంగ్రెస్ చెలిమిచేసే అవకాశాలు అంతర్థాన మైనాయి. 22 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన మాయావతి మధ్యప్రదేశ్ విధానసభలోని మొత్తం 230 స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించారు. రాజస్థాన్ కూడా కాంగ్రెస్ పొత్తు ఉండదని చెప్పారు. తమ పార్టీకి గౌరవప్రదమైన స్థానాలిచ్చే పార్టీతోనే సఖ్యత అనే వైఖరి తీసుకున్నారు.
ఇదిలాఉండగా, రాష్ట్రంలో కొత్తగా మూడు రాజకీయ సంస్థలు ఏర్పడ్డాయి. మొదటిది అగ్రకులాల వారిది, రెండు, గిరిజన నాయకులది, మూడు, చిన్నచిన్న పార్టీలతో కూడిన ఫ్రంట్. ఈ ఫ్రంట్ మాజీ కేంద్రమంత్రి, మాజీ జెడి(యు) నాయకుడు శరద్ ముఖ్య నాయకుడు. ఈ గ్రూపులు ఎవరి అవకాశాలనుకాంగ్రెస్ లేక బిజెపి దెబ్బ కొడతాయన్నది ఇప్పుడే ఊహించటం సాధ్యం కాదు.
అగ్రవర్ణాల వారితో ఏర్పడిన సామాన్య పిచ్చర అల్పసంఖ్యాక్ కల్యాణ్ సమితి (ఎస్పి ఇప్పటివరకు రిజర్వేషన్ వ్యతిరేకంగా, ఎస్‌సి/ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టానికి వ్యతిరేకం గా ఆందోళన చేస్తోంది. చట్టానికి వ్యతిరేకంగా అది పలు ర్యాలీలు నిర్వహించింది. అయితే సపక్స్ రాజకీయ పార్టీగా మార్చాలని వారిప్పుడు నిర్ణ యించారు. మాజీ ఉన్నత ప్రభుత్వోద్యోగులు, వృత్తి ప్రవీణులు ఇందులో ప్రధానంగా ఉన్నారు. ఈ పార్టీ పేరు సపక్స్ సమాజ్ మాజీ ఐఎఎస్ హిరాలాల్ త్రివేదిని అధ్యక్షునిగా, మరో రిటైర్డ్ ఐఎఎస్ మహిళా అధికారి వీణ ఘన్ ఉపాధ్య క్షునిగా ఎన్నుకున్నారు. తమ పార్టీ 230 సీట్లకూ పోటీచేయతలపెట్టినట్లు త్రివేది ప్రకటించారు. రిజర్వేషన్ ఎస్ అత్యాచారాల నిరో ధక చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరు కావటం రాజకీయ పార్టీగా మారేందుకు వారికి ప్రోత్సాహమిచ్చింది.
సపక్స్ సమాజ్ చెందిన సభ్యు లెవరైనా క్రిమినల్ రికార్డులేదని నిరూపించుకున్న వారందరూ పార్టీ సభ్యులవుతారని త్రివేది ప్రకటించారు. ఆఫీసు బేరర్లలో రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్ ఒక బడావ్యాపారి, ఒక మాజీ బ్యాంకర్ ఉన్నారు. సమాచార శాఖ రిటైర్డ్ డైరెక్టర్ సురేశ్ తివారి ప్రధాన కార్యదర్శి. తమ పార్టీ మెజారిటీ సాధిస్తుందన్న విశ్వాసానికి ఏమిటి ప్రాతిపదిక అని ప్రశ్నించగా, “సమాజం మార్పు కోరుకుంటోంది. రాష్ట్రమంతటా పర్యటించినపుడు దాన్ని గమనించాం. ఆప్ చూడండి. ఆ కొత్త
పార్టీ ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా” అన్నారు త్రివేది.
గిరిజనుల ప్రతినిధులు ఏర్పాటు చేసిన మరో సంస్థ నుంచి బిజెపి, కాంగ్రెస్ సవాలు ఎదు ర్కొంటున్నాయి. ఈ సంస్థ పేరు జయ్ యువ ఆదివాసీ సంఘటన్. ఈ సంస్థ మహాసభ కుక్షిలో జరిగింది. ఆశ్చర్యకరంగా, ప్రసిద్ధ హిందీ సినీ నటుడు గోవింద మహాసభలో పాల్గొని ఆదివాసీలు తమ బలాన్ని గుర్తెరగాలని ఉద్బోధించాడు. 10 జిల్లాల నుంచి యువ ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. గుజరాత్, మహారాష్ట్ర నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. అత్యధికులు యువతరం. ఆదివాసీలు ఆధిక్యంలో ఉన్న 80 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామని సంస్థ అధ్యక్షుడు డాక్టర్ హీరాలాల్ ప్రకటించారు.
“ఏ రాజకీయ పార్టీ ఆదివాసీల సంక్షేమాన్ని పట్టించుకోలేదు. మన ప్రయోజనాలను మనమే కాపాడుకోవలసిన సమయమొచ్చింది. మనకు అధికార మున్నప్పుడే అది సాధ్యం”అన్నారాయన .
మరో కూటమిని శరద్ ప్రకటించారు. లోక్ జనతాదళ్, ఎస్ సిపిఐ, సిపిఐ (ఎం), బహుజన్ సంఘర్ష్ గోండ్వానా గణ తంత్ర పార్టీ, రాష్ట్రీయ సమతాదళ్, ప్రజా తంత్రిక్ సమాధాన్ పార్టీ అందులో ఉన్నాయి.
ఎల్.ఎస్.హర్దేనియా

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments