అత్యధికంగా నల్లగొండ జిల్లా గుడాపూర్లో 45.8 డిగ్రీలు
వచ్చే మూడు రోజుల్లో రాష్ట్రంలో వడగాలి, వడగల్లు
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నా యి. అంతటా 42 డిగ్రీల నుండి 46 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదువుతున్నా యి. అత్యధికంగా శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా గుడాపూర్లో 45.8 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. తరువాత అదే జిల్లా మామిడాలలో 45.6, సూర్యాపేట జిల్లా మునగాల, పెద్దపల్లి జిల్లా మంథనిలో 45.5 డిగ్రీలు, నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి, దామరచర్ల, మంచిర్యాల జిల్లా జన్నారం, నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో 45.4 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, పెద్దపల్లి, మెదక్, నిజామాబాద్ జిల్లాలో వడగాలి ఎక్కువగా ఉంది. కాగా, పలు చోట్ల చెదురుమదురు వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో 2.7 సెంటీమీటర్ల, బూర్గుంపాడులో 2, గుండాలో ఒక్క సెంటీమీటర్ వర్షం పడింది. శనివారం ఉష్ణోగ్రతల్లో స్పల్ప తగ్గుదల ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే మూడు రోజుల పలు చోట్ల చెదరుమదురు లేదా ఉరుముల మెరుపులతో వడగల్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
అంతటా వడగాలే
RELATED ARTICLES