ఒక్క‌రోజే 10 పాజిటివ్ కేసులు

తెలంగాణ‌లో 59కి చేరిన క‌రోనా కేసులు
మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్

ప్ర‌జాప‌క్షం/హైద‌రాబాద్ : కరోన వ్యాధికి సంబంధించి మన రాష్ట్రంలో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 59. ఈ విష‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు శుక్ర‌వారంనాడు ప్ర‌క‌టించారు. అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశానంత‌రం కెసిఆర్ ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో మాట్లాడారు. “ఇప్పుడు 58 మంది ట్రీట్మెంట్ లో ఉన్నారు,మరో 20 వేల మంది హోమ్ క్వారన్తటైన్ లో గాని ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారన్తటైన్ లో ఉన్నారు. ఇవాళ ఒక్కరోజే 10 పాజిటివ్ కేస్ లు వచ్చాయి. ప్రజలకి ధన్యవాదాలు,లాక్ డౌన్ కు చాలా సహకారాన్ని అందిస్తున్నారు. మనం ఇలాంటి ఆంక్షలు పెట్టకపోతే మనం ఇబ్బంది లో పడేవారిమి. ప్రపంచంలో దీనికి మందు లేదు,ప్రపంచ దేశాలు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నాయి.దీనిని అరికట్టేందుకు ఓన్లీ స్వీయనియంత్రణ పాటించాలి. అమెరికా లాంటి దేశం కూడా ఈ వ్యాధి తో అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని అంటే సోషల్ డిస్టన్స్ మాత్రమే. అమెరికా,స్పైన్, ఇటలీ స్థాయి లో ఇండియాలో వస్తే 20 కోట్ల మంది వ్యాధి బారిన పడుతారు అని చెప్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరు దయచేసి స్వీయనియంత్రణ పాటించాలి. మనం దీన్ని ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నాం,ఉదయం నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో మాట్లాడను. వారు కూడా రాష్ట్రానికి కావలసిన సహాయసహకారాలు అందిస్తాం అన్నారు వారికి ధన్యవాదాలు. 80.9 శాతం మైల్డ్ వీరికి ఇబ్బంది ఉండదు. వీరు తట్టుకునే పరిస్థితి ఉంటుంది. మనం ఇంకొకల మీద ఆధారపడి ఉండకుండా వైద్యులు, నర్సులు, ఇతర ఏర్పాట్ల పై నిన్న అంత చర్చించాం. డాక్టర్లకు ,నర్సులకు ఇతర సిబ్బంది కి కావాల్సిన భోజనం,ఇతర ట్రాన్స్పోర్ట్ కావాల్సిన అన్ని సిద్ధం చేశాం. 1400 ఐసియు బెడ్స్ అందుబాటులో ఉన్నాయి ఇవ్వి అన్ని కూడా గచ్చిబౌలి స్టేడియంలో సిద్ధం అవుతున్నాయి. వెంటిలేటర్ కూడా 500 ఆర్డర్ ఇచ్చాము. 11500 మంది ఐసో లేషన్ లో ఉంచేందుకు సిద్ధంగా ఉంది. సుమారు 60 వేల మందికి ఈ వైరస్ సోకిన వారికి కూడా వైద్యం అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. రిటైర్డ్ డాక్టరు లు ,అందరిని గుర్తించినం,ఇతర స్టాప్ ను కూడా తీసుకుని వైద్యం అందిస్తాం. 14 వేల అదనపు డాక్టర్ల బృదం ను సిద్ధం చేస్తున్నం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రావద్దు.దయచేసి ప్రభుత్వ, పోలీస్, వైద్య సిబ్బందికి సహకరించాలి. ఇది అంత చేస్తూనే ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ పై కూడా దృష్టి పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం లో ఉన్న ఇతర రాష్ట్రాల వారికి కూడా విజ్ఞప్తి మీకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చూస్తోంది మిరు ఇబ్బంది పడవద్దు ప్రభుత్వం ను ఇబ్బంది పెట్టవద్దు. 50 లక్షల ఎకరాల్లో పంటలు ఉన్నాయి,పంట చేతుకు వచ్చే సమయం ఇది ,పంట చేతికి వస్తేనే మనం తింటాం. ఎస్సార్ ఎస్పీ,నాగార్జున సాగర్,జూరాల కింద నీళ్లు ఏప్రిల్ 10వ తేదీ వరకు సప్లై చేయాలని కోరాం. చాలా మంది మంత్రుల తోమాట్లాడను అందరూ కూడా ఇదే చెప్పారు” ఏప్రిల్ 10 వ తేదీ వరకు న్నీళ్లు ఇస్తాం. ఒక్క ఎకరం పంట కూడా ఎండ కుండ పంట పండించుకోవాలి. ఇవాళ పిక్ డిమాండ్ 9 వేలు ,పగలు రాత్రులు కష్టపడి నిరంతరం విద్యుత్ ఇవ్వాలని చెప్పారు ప్రభాకర్ రావు గారు. విద్యుత్ సరఫరా జరిగే విదంగా విద్యుత్ సిబ్బంది పని చేయాలి అని కెసిఆర్ అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?