కెన్యాలో ఆత్మాహుతి దాడి: 15 మంది మృతి

నైరోబీ: కెన్యా రాజధాని నైరోబీలో జరిగిన ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ హోటల్‌లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. నైరోబీలోని వెస్ట్‌లాండ్స్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని ‘డస్టిట్‌డీ2’ హోటల్‌ కాంప్లెక్స్‌ ప్రాంగణంలోకి ముష్కరులు ప్రవేశించారు. పార్కింగ్‌ ప్రాంతంలో నిలిపి ఉంచిన వాహనాలపైకి బాంబులు విసిరారు. అనంతరం ఓ దుండగుడు తనను తాను పేల్చుకున్నాడు. దాడి అనంతరం తుపాకులతో ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 15 మంది మృతి చెందినట్లు సమాచారం. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దాడి సమాచారం అందుకున్న వెంటనే హోటల్‌ కాంప్లెక్స్‌ను భద్రతాబలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ ఘటనకు తామే బాధ్యులమని ‘అల్‌-షబాబ్‌’ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.

DO YOU LIKE THIS ARTICLE?