ఉదయ్ కిరణ్ చనిపోవడానికి కారణం వారేనంట…

సందర్భం ఏదైనా వస్తే ఉదయ్ కిరణ్‌ను తలుచుకొని బాధపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. కుర్రకారు గుండెల్లో స్థానం సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు మూడేండ్లు కావోస్తున్నా అతని మరణ విషాదం ప్రతీ ఒక్కరిని వెంటాడుతూనే ఉంటుంది. తాజాగా ఉదయ్ కిరణ్ మృతి గురించి ఓ కార్యక్రమంలో మా అధ్యక్షుడు, సినీ నటుడు శివాజీ రాజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఉదయ్ కిరణ్ జన్మదినం పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో షార్ట్ ఫిలిం పోటీలకు సంబంధించిన విజేతలకు పురస్కరాలు అందించారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ… ఉదయ్ కిరణ్‌ మరణానికి కారణం సినీ పరిశ్రమయే అని సంచలన వ్యాఖ్యలు చేసారు. బాధలో ఉన్నవారిని ఎవరూ పట్టించుకోరు అని ఆరోపించారు.
సినిమా పరిశ్రమలో చాలా మంది స్వార్ధపరులు ఉన్నారు. ఇక్కడ ఎవరి స్వార్థం వారిదే గాని, పక్కవాడిని పట్టించుకోవడం ఉండదని అన్నారు. ఉదయ్ కిరణ్ ప్రతిభావంతుడైన నటుడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కింది స్థాయి నుంచి విశేష కృషితో పైకి వచ్చాడు. అలాంటి నటుడు అర్ధాంతరంగా జీవితం చాలించడం చాలా దురదృష్టకరం అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా నిర్వహించడం చూస్తుంటే ఉదయ్ కిరణ్ బతికి ఉన్నాడనే అనిపిస్తున్నది అని అన్నారు. ఉదయ్ కిరణ్ పేరు నిర్వహించే కార్యక్రమానికి రావడం గర్వంగా ఉందని, నాకు మాత్రమె కాకుండా శ్రీకాంత్, తరుణ్‌కు చాలా మందికి మంచి సన్నిహితుడు అని శివాజీ రాజా అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?