ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి

ఆర్ఆర్ఆర్ నుంచి రామ్ చరణ్ మోషన్ వీడియో విడుదల
ఉగాది సందర్భంగా రణం రౌద్రం రుధిరం నుంచి విడుదలైన సినిమా టైటిల్ కు మోషన్ వీడియోకు హై ఎండ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్డంగా సినిమాలో చరణ్ లుక్ రివీల్ చేస్తామని చిత్ర యూనిట్ నిన్నే ప్రకటించింది. అప్పటి నుంచి మెగాభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ విడీయో రిలీజ్ చేసింది యూనిట్. ‘ఆడు కనబడితే నిప్పు కణిక నిలబడినట్టు ఉంటది.. కలబడితే వేగు చుక్క ఎగబడినట్టు ఉంటది.. ఎదురుబడితే చావుకైనా చమట దారకడతది.. ప్రాణమైనా బందూకైనా వానికి బాంచన్ ఐతది.. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న.. మన్నెం దొర అల్లూరి సీతారామరాజు’ అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో ఈ వీడియో రిలీజ్ చేసారు. ఇందులో రామ్ చరణ్ ఫుల్ బాడీ ఫిట్ తో అల్లూరి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశాడనే చెప్పాలి. ఒంటిమీద జంధ్యం, మెడలో ఓంకారం లాకెట్ తో రామ్ చరణ్ లుక్ అదరగొట్టేస్తోంది. చరణ్ ఇంట్రడక్షన్ కు గంభీరమైన ఎన్టీఆర్ వాయిస్ అద్భుతమనే చెప్పాలి.
ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతయాని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమాలో రామరాజుగా చరణ్ పాత్రపై ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టే. మన్యం ప్రాంతంలో ఉండే అల్లూరి ఆహార్యాన్ని చరణ్ పాత్రలో రాజమౌళి పున:ప్రతిష్ట చేసాడా అన్నట్టు రామ్ చరణ్ లుక్ ఉంది. కీరవాణి మ్యూజిక్ ఈ వీడియోకు ఫుల్ ఎస్సెట్. ఈ టీజర్ చరణ్ కు నిజమైన బర్త్ డే గిఫ్ట్ అని చెప్పాలి.

DO YOU LIKE THIS ARTICLE?