ఐ అండ్ పిఆర్ మాజీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సి.వి.న‌ర‌సింహారెడ్డి ఇక‌లేరు

హైద‌రాబాద్‌/ప‌్ర‌జాప‌క్షం : ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పిఆర్‌) డైరెక్ట‌ర్‌గా విశిష్ట సేవ‌లందించిన డాక్ట‌ర్ సి.వి.న‌ర‌సింహారెడ్డి బుధ‌వారం సాయంత్రం 8.45 గంట‌ల‌కు క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 87 సంవ‌త్స‌రాలు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు, ఒక కుమార్తె. న‌ర‌సింహారెడ్డి స‌తీమ‌ణి కొన్ని సంవత్స‌రాల క్రిత‌మే మ‌ర‌ణించారు. స‌మాచార‌, పౌర సంబంధాల శాఖ‌లో వివిధ ద‌శ‌ల్లో ఆయ‌న ప‌లు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. పాత్రికేయుల‌కు మంచి మిత్రునిగా కొన‌సాగారు. కాగా, ఆయ‌న భౌతిక‌కాయానికి అంత్య‌క్రియ‌లు గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు న‌గ‌రంలోని మ‌హాప్ర‌స్థానంలో జ‌రిగాయి. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు సంతాపం వ్య‌క్తం చేశారు. సిపిఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి చాడా వెంక‌ట‌రెడ్డి, ప్ర‌జాప‌క్షం సంపాద‌కులు కె.శ్రీ‌నివాస్‌రెడ్డి, మిత్రులు, బంధువులు ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు.
సిఎం సంతాపం
డాక్ట‌ర్ సి.వి.న‌ర‌సింహారెడ్డి మృతి ప‌ట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు గురువారంనాడు ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేశారు. పౌర సంబంధాల వృత్తిలో ఆయ‌ను భీష్మ పితామ‌హునిగా, అగ్ర‌గామిగా అభివ‌ర్ణించారు. పౌర సంబంధాల విభాగానికి ఆయ‌న చేసిన సేవ‌ల‌ను కెసిఆర్ కొనియాడారు.

DO YOU LIKE THIS ARTICLE?