సమస్యాత్మక నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్‌

హైదరాబాద్‌: తెలంగాణలో 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంట‌ల‌కే పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మిగతా 106 నియోజకవర్గాల్లో 5 గంట‌ల‌కు వ‌ర‌కు పోలింగ్‌ కొనసాగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందుగానే పోలింగ్‌ ముగిసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఐదు, ఖమ్మం జిల్లాలో ఐదు, వరంగల్‌ జిల్లాలో రెండు, కరీంనగర్‌ జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని ఎన్నికల సంఘం అధికారులు సమస్యాత్మక స్థానాలుగా గుర్తించి 4గంటలకే పోలింగ్‌ను ముగించాలని నిర్ణయించారు.

సమస్యాత్మక నియోజకవర్గాలివే..
సిర్పూర్‌, చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల‌, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం, మంథని.

DO YOU LIKE THIS ARTICLE?