కేసీఆర్ తప్ప బాగుపడ్డ వారెవరూ లేరు!

ప్రజాపక్షం/మహబూబ్ బ్యూరోః ఎంతో మంది ప్రాణ త్యాగాలు, ఉద్యోగాలకు రాజీనామాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కేసీఆర్ తప్ప బాగుపడిన తెలంగాణ ప్రజలు ఎవ్వరూ లేరని కేంద్ర మాజీ మంత్రి జయరామ్ రమేష్ విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాల క్రితం సోనియాగాంధీ ఎన్నో బాధలు, భావోద్వేగాలు మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఆనందంగా ఉన్నపరిస్థితులు లేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే రెండు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందన్న సంగతి తెలిసి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవంతో ఆమె తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పూనుకున్నారని అన్నారు. బంగారు తెలంగాణ అంటూ కుటుంబ పాలన చేస్తూ దౌర్భాగ్య తెలంగాణగా మార్చారని విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయని వస్తాయని మోసపూరిత హామీలు గుప్పించే వారి ఆశయాలను తుంగలో తొక్కారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నిరుద్యోగులు ఉద్యోగులు అందరూ కూడా చాలా ఇబ్బంది కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?