ఓటు వేయ‌డానికి విదేశాల నుంచి…

హైదరాబాద్‌: ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్‌ మహానగరంలో యువత, పలువురు ఉద్యోగస్తులు సొంత ఊళ్లకు పయనమైతే.. హైద‌రాబాద్‌లో ఓటు వేసేందుకు సీతాఫల్‌మండికి చెందిన సత్య ప్రకాష్ అనే వ్య‌క్తి అమెరికా నుంచి వ‌చ్చాడు. అలాగే సరితగౌడ్ అనే యువతి కూడా దక్షిణాఫ్రికా నుంచి సికింద్రాబాద్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేయడం కోసమే నగరానికి వచ్చిన వీరి గురించి పోలింగ్‌ కేంద్రాల వద్ద తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?