కెసిఆర్ మూడు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్య‌మంత్రి ఈనెల 23 నుంచి మూడు రాష్ట్రాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. ఈ నెల 23న ఉదయం 10గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సిఎం కెసిఆర్‌, కుటుంబ సభ్యులతో కలిసి విశాఖకు బయల్దేరతారు. విశాఖలో శారద పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకుంటారు. ఆ తర్వాత ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ వెళ్తారు. సాయంత్రం 6గంటలకు ఒడిశా సిఎం నవీన్‌ పట్నాయక్‌తో కెసిఆర్‌ సమావేశం కానున్నారు. 24న కోణార్క్‌, పూరీ జగన్నాథ్‌ ఆలయాలను సందర్శిస్తారు. అనంతరం భువనేశ్వర్‌ చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు వెళ్తారు. సాయంత్రం ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమతా బెనర్జీతో సమావేశమవుతారు. ఆ తర్వాత కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదే రోజు రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నెల 25 నుంచి రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే కెసిఆర్‌ బస చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని మర్యాదపూర్వకంగా భేటీ కానున్న ముఖ్యమంత్రి ‌ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతోనూ సమావేశమవుతారు. బిఎస్‌పి అధినేత్రి మాయావతి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌తోనూ కెసిఆర్‌ సమావేశం కానున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?