ఐఎన్‌ఎల్‌డి ఎంఎల్‌ఎ జస్విందర్‌ సంధు మృతి

ఛండీగర్‌: ఐఎన్‌ఎల్‌డి సీనియర్‌ శాసనసభ్యుడు జస్విందర్‌ సంధు (63) శనివారం నాడు మరణించారు. గత కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. సంధుకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. 1991, 1996, 2000, 2014లో హర్యానా విధానసభకు ఎన్నికయ్యారు. ఆయన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. జస్విందర్‌ మృతి పట్ల హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, ఐఎన్‌ఎల్‌డి హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ అరోరా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కురుక్షేత్ర జిల్లా గుంథ్లా ఘరు గ్రామంలో జస్విందర్‌ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?