జుట్టుకు రంగేసుకుని అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్నా..

తిరువనంతపురం: ప్రసిద్ధ శబరిమల ఆలయంలోకి తాజాగా 36 ఏళ్ల మంజు అనే ఓ దళిత మహిళ తాను వృద్ధ మహిళగా కన్పించేందుకు తలకు రంగేసుకొని మంగళవారం ఆలయంలోకి ప్రవేశించినట్లు పేర్కొంది. మహిళ ఫెడరేషన్‌ కార్యకర్త అయిన ఆమె ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పేర్కొంది. జుట్టుకు రంగేసుకొని ఆలయంలోకి 18 మెట్ల ద్వారా దర్శనానికి వెళ్లానని, ఇక మీదటా ఆలయంలోకి వెళ్తానని తెలిపింది. ఈమె గత అక్టోబర్‌లో ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 20 మంది మహిళల్లో ఒకరు. దీంతో ఆందోళనకారులు ఈమె ఇంటిపై దాడి చేశారు.
అయితే, మంజు తనకు తానుగా ఆలయంలోకి ప్రవేశించానని చెప్పడంతో ఆలయాధికారులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఆమె ప్రవేశించింది అని చెప్పడానికి ఎటువంటి సరైన ఆధారాలూ లేవని పేర్కొన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఆలయంలోకి 10 మంది మహిళలు ప్రవేశించారనేది కూడా నిజం కాదని తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?