ఇంటింటికీ ఉచితంగా ఆహారం : కేర‌ళ‌ స‌ర్కారు చొర‌వ‌

తిరువనంతపురం : కొవిడ్‌-19 (కరోనా) వైరస్‌ వ్యాప్తిచెందకుండా నిరోధించే చర్యలలో భాగంగా దేశమంతటా ఏప్రిల్‌ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటిం చిన నేపథ్యంలో ఎవరూ ఆకలితో ఎవరూ అలమటించకుండా చూసేలా కేరళ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. స్థానిక సంస్థలు సామూహిక వంటశాలలను నిర్వహిస్తాయని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆహారం కోసం ప్రజలు ఫోన్‌ చేస్తే వలంటీర్లు వారి ఇంటికి తీసుకువెళ్లి అందజేస్తారు. హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారికి కూడా స్థానిక సంస్థలు ఆహారాన్ని అందజేస్తాయి. కేరళలో ఉన్న వలస కార్మికులకు వసతి, తిండి అందే విధంగా చూడాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సం స్థలు, రెవెన్యూ విభాగానికి అప్పగించింది. ‘ప్రస్తు తం నెలకొన్న పరిస్థితి ప్రజలను ఆకలిలోకి నెట్టే విధంగా ఉంది. లాక్‌డౌన్‌ సందర్భంగా కేరళలో ఏ ఒక్కరూ కూడా ఆకలితో చనిపోకుండా రాష్ట్ర ప్రభు త్వం చూస్తుంది. ఆహారం తయారుచేసుకో లేని వారికి ఆహారం అందజేసే బాధ్యతను స్థానిక స్వయంపాలిత సంస్థలు తీసుకుంటాయి..’ అని సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. స్థానిక ప్రభు త్వాలు గ్రామ పంచాయతీల నుంచి మున్సి పాల్టీల వరకు సామూహిక వంటశాలలను ఏర్పా టు చేస్తాయి. ప్రతి స్థానిక సంస్థ ఆహారం అవసర మయ్యే ప్రజలు ఎంతమంది ఉంటారనేది అంచ నావేయాలన్నారు. ‘కొంతమంది మొహమాటంతో నేరుగా ఆహారం కోరకపోవచ్చు. వారికి ఫోన్‌ నం బరు ఇస్తే ఫోన్‌లో అడగవచ్చు. అందువల్ల సహా యం కోరలేదని చెప్పి అటువంటి వారికి సహా యాన్ని అందించకుండా ఉండవద్దు” అని ముఖ్య మంత్రి సూచించారువంటచేసే వారిని, ఆహా రాన్ని అందించేందుకు వలంటీర్లను స్థానిక సంస్థలు చూసుకోవాలని విజయన్‌ కోరారు. ప్రధానంగా ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికుల సరరక్షణను జాగ్రత్తగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

DO YOU LIKE THIS ARTICLE?