కంటైనర్‌ను ఢీకొన్న కారు: నలుగురు మృతి

గుంటూరు: గుంటూరు జిల్లాలో చెన్నై-కోల్‌కతా 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా ములకలచెరువు గ్రామానికి చెందిన ఏడుగురు కారులో తూర్పుగోదావరి జిల్లా యర్రవరంలో ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్నారు. యడ్లపాడు మండలం వంకాయలపాడు వద్ద ముందు వెళ్తున్న కంటైనర్‌ను వీరి కారు బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఏడుగురిని 108 సిబ్బంది గుంటూరు కాటూరి మెడికల్‌ వైద్య కళాశాలకు తరలించారు. చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో డ్రైవర్‌తో పాటు బాలుడు, యువతి, మహిళ ఉన్నారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?