ఆస్ట్రేలియాను ముంచెత్తిన వ‌ర‌ద‌లు

సిడ్నీ: ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్లే నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో టౌన్స్‌విల్లే జలదిగ్బంధమైంది. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. స్థానికులు దిక్కుతోచని పరిస్థితిలో పడవల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. టౌన్స్‌విల్లేకు సమీపంలో ఉన్న క్వీన్స్‌లాండ్‌కు వరదముప్పు పొంచి ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?