స‌ర్వే స‌త్య‌నారాయ‌ణపై స‌స్పెన్ష‌న్ వేటు

హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ‌ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదివారంనాడు స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. పార్టీకి వ్య‌తిరేకంగా తీవ్ర విమ‌ర్శ‌లు చేసినందుకు పిసిసి సిఫార్సు మేర‌కు ఈ వేటు ప‌డింది. ఆదివారంనాడు ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై జ‌రిగిన స‌మీక్ష సంద‌ర్భంగా స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి కుంతియా, పిసిసి అధ్య‌క్షులు ఉత్త‌మ్ కుమార్‌రెడ్డిల‌కు వ్య‌తిరేకంగా అనుచిత వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు తెలిసింది. అందుకే ఆయ‌న‌ను పార్టీ అధిష్ఠానం స‌స్పెండ్ చేసిన‌ట్లు తెలిసింది. అనంత‌రం స‌ర్వే మాట్లాడుతూ, ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి త‌న‌పై రౌడీల‌తో దాడి చేయించార‌ని, రాష్ట్రంలో పార్టీ ఓట‌మికి ఉత్త‌మ్, కుంతియాలే కార‌ణ‌మ‌ని ఆరోపించారు. ఆ మాట అన్నందుకే త‌న‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు ఆరోపించారు.

DO YOU LIKE THIS ARTICLE?