190 వెంటిలేటర్ బెడ్స్ సిద్ధం : ఈటల

కరోనా పషెంట్స్ కు చికిత్స అందించేందుకు ఏర్పాట్లలో తెలంగాణ దేశంలోనే ముందు ఉంది
ముఖ్యమంత్రి కేసీఆర్ క్షణక్షణం పర్యవేక్షిస్తున్నారు
ప్రస్తుతానికి రాష్ట్రంలో క్రాస్ కంటామినేషన్ జరగలేదు
చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కాకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటున్నాం
పదివేల బెడ్ ను కరోనా పాజిటివ్ కేసుల చికిత్స కోసం సిద్ధం చేశాము
ఏడు వందల ఐసీయూ, 190 వెంటిలేటర్ బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి.

ప్ర‌జాప‌క్షం/హైదరాబాద్ : చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది అని వార్తలు వచ్చిన రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రమత్తం చేశారు. ఆ రోజు నుంచి ప్రతిరోజూ సమీక్ష నిర్వహించుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. విమానాశ్రయాలు స్క్రీన్ చేసి అనుమానం ఉన్న వారికి పరీక్షలు చేసాము. 26 రోజుల్లో 47 మంది కరుణ వైరస్ పాజిటివ్ ఉన్నట్లు గా గుర్తించి చికిత్స అందిస్తున్నాము. వీరిలో ఇప్పటికే ఒకరు కోలుకొని ఇంటికి వెళ్లారు. రేపటి నుంచి మరికొంత మందిని డిశ్చార్జ్ చేయబోతున్నాము.ఇతర దేశాల్లో లాగా మన రాష్ట్రంలో క్రాస్ కంటామినేషన్ జరగడం లేదు.
22వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాశ్రయం మూసి వేశారు, 14 రోజులు వైరస్ ఇంకుబేషన్ పీరియడ్ ఉంటుంది. వారం రోజుల్లో ఇది ముగుస్తుంది. ఈ వారం రోజుల్లో ఎన్ని కేసులు వస్తాయో స్పష్టమౌతుంది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు సమాయత్తమవుతున్నాం. ఇందుకోసం గాంధీ, కింగ్ కోటి లాంటి హాస్పిటల్స్ ను పూర్తిస్థాయిలో కరోనా వైరస్ చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసుకున్నాము. దాదాపుగా ఏడు వేల బెడ్లు ప్రభుత్వంలో అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కలుసుకొని 10 వేల బెడ్స్ అందుబాటులోకి తీసుకువచ్చాం. వీటితో పాటు ఏడు వందల ఐసియు బెడ్స్, 190 వెంటిలేటర్ బెడ్స్ సిద్ధం చేశాము. దేశంలో అన్ని రకాలుగా సంసిద్ధత తో ఉన్న రాష్ట్రం తెలంగాణ. మొదటి ఫేజ్ లో ప్రభుత్వ ఆసుపత్రులను మాత్రమే కరోనా వైరస్ చికిత్స అందించేందుకు ఉపయోగిస్తున్నాము. రెండవ పేజ్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుసంధానంగా ఉన్న హాస్పిటల్సను వినిగిస్తాం. మూడవ ఫేజ్ లో జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ను వినియోగిస్తాము. ప్రైవేట్ మెడికల్ కాలేజీ వారందరూ వారి అనుబంధ హాస్పిటల్స్ లో సోమవారం నుంచి అవుట్ పేషెంట్లను బంద్ చేసి మొత్తం ఆసుపత్రిని కరోనా చికిత్స కోసం కేటాయించాలి. వారం రోజులలో పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని ఈరోజు కోఠిలోని కరుణ కమాండ్ కంట్రోల్ సెంటర్ జరిగిన సమావేశంలో మెడికల్ కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్ కు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్స్ ప్రభుత్వమే అందిస్తుంది. వారి స్టాఫ్ కి అవసరమైన పాసులు, రవాణా సదుపాయం, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటే డబ్బులు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ వైరస్ ఈ నేపథ్యంలో డాక్టర్ దేవుడుతో సమానంగా చూడబడుతున్నారు అందుకే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నాము. దేశంలో ఇన్ని మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రం మరోటి ఉండదు ఇవన్నీ ఉండటంవల్ల మనం చాలా మంది రోగులకు చికిత్స అందించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రతి మెడికల్ కాలేజ్ కి ఒక నోడల్ ఆఫీసర్ ఏర్పాటు చేసి కాళోజి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నాము.
తాత్సారం చేయకుండా ఏర్పాట్లు చేసి వారం రోజుల్లోగా ఆసుపత్రులను మాకు మా అధీనంలోకి అప్పగించండి అని మంత్రి కోరారు. కరోనా చికిత్సకు ముందుకు వచ్చిన ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలకు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యమంత్రి గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య పరిస్థితులను క్షణక్షణం పరిశీలిస్తున్నారు. ప్రజల భద్రతకు పూర్తి భరోసా కల్పిస్తున్నారు అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?