ప్రవేశపరీక్షలన్నీ వాయిదా

ప్రకటించిన తెలంగాణ ఉన్నత విద్యామండలి

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు నాటికి పొడిగించన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేసింది. ఎంసెట్‌ సహా మే నెలలో జరగాల్సిన ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. పరీక్షల కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మే 5 వరకు గడువు పొడిగించినట్లు ఆయన తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?