డిపిసిసి అధ్య‌క్ష‌ పదవికి మాకెన్‌ రాజీనామా

న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌ రాజీనామా చేశారు. గురువారం రాత్రి పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమైన అనంతరం మాకెన్‌ తన రాజీనామా విషయాన్ని ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. మాకెన్‌ రాజీనామాను రాహుల్‌ గాంధీ ఆమోదించారు. ‘2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా కొనసాగాను. ఈ నాలుగేళ్లు రాహుల్‌గాంధీ, పార్టీ కార్యకర్తలు, మీడియా నుంచి వెలకట్టలేని ప్రేమ, మద్దతు పొందాను’ అని మాకెన్‌ ట్వీట్‌ చేశారు. మాకెన్ స్థానంలో పార్టీ మరో సీనియర్‌ నాయకుడు అర్విందర్‌ సింగ్‌ లవ్లీకి ఢిల్లీ కాంగ్రెస్‌ బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్య కారణాల వల్ల మాకెన్‌ ఈ పదవి నుంచి తప్పుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

DO YOU LIKE THIS ARTICLE?