దేశ పరిరక్షణకు రాజ్యాంగ ప్రతిజ్ఞ

అంబేద్కర్‌ జయంతి సందర్భంగా పేదలకు సాయం
సిపిఐ శ్రేణులకు డి.రాజా పిలుపు

ప్రజాపక్షం/న్యూఢిల్లీ : ఏప్రిల్‌ 14వ తేదీ మంగళవారంనాడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 129వ జయంతి పురస్కరించుకొని, మన దేశాన్ని పరిరక్షించుకునేందుకు రాజ్యాంగంపై ప్రతిజ్ఞ చేసి, అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించాల్సిందిగా పార్టీ శ్రేణులకు సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సోమవారంనాడొక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కరోనావైరస్‌ విజృంభిస్తున్న వేళ గతంలో చేసినట్లుగా కార్యక్రమాలు చేయలేకపోయినప్పటికీ, లాక్‌డౌన్‌ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు సాయం చేయాలన్న మన నిబద్ధతను పునరంకితం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వియోగం చేసుకోవాలని కోరారు. లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించకుండా, పేదవర్గాలను కలుసుకోవడానికి కృషి చేయాలని, ఇందుకోసం వివిధ శ్రేణులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కరోనా బాధితులకు మద్దతుగా నిలవడంతోపాటు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలవాలని, వారికి ఆహారం, రేషన్‌, ఆశ్రయం, వైద్య సదుపాయాలు కల్పించాలని, అవసరమైతే స్థానిక అధికారుల సాయం తీసుకోవాలని కోరారు. పేదల బాధలను అర్థం చేసుకొని వారికి చేయూతనివ్వడమే, అంబేద్కర్‌కు ఇచ్చే ఘనమైన నివాళి అని రాజా పేర్కొన్నారు. మన పార్టీ స్వంతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూనే, సామాజిక కార్యకర్తలు, ఉద్యమాలకు సంఘీభావం తెలియజేస్తూ, మానవ హక్కులకు తోడ్పాటుగా నిలుస్తూ ఇతర వామపక్షాలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించడానికి సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు.

 

CPI General Secretary D. RAJA Writes to the Party Cadres on the 129th Birth Anniversary of Dr. B.R. Ambedkar

Dear Comrades,

April 14, 2020 is the 129th birth anniversary of Dr. B.R. Ambedkar. He was the prime architect of the Constitution which is the fundamental Law of the Sovereign, Socialist, Secular, Democratic Republic of India. He was a great fighter for justice – social, political and economic – for all.

Since there is COVID-19 lockdown, we may not be able to mark the Day as we did in the past. Despite the lockdown, this year, the Day has given us an opportunity to reiterate our commitment to the poor, the exploited and discriminated working masses of the country. They are facing the brunt of the lockdown.

Let us mark the day without violating any of the lockdown norms by reaching the needy and poor masses. Such an endeavor, in fact, has to be done at the local and branch level in consultation with higher committees with a missionary zeal.

Party units at all levels should take up the issue of distribution of food and dry ration, ensuring availability of shelter and heath care, taking up with authorities the question of financial support and extend all  support to all the affected people.

At the time of the present calamity caused by Corona virus, the party branches must come forward and ensure that on the day of the birth anniversary of Dr. Ambedkar, the miseries of the masses are brought down to the minimum.

While our Party is doing all these independently, it has to cooperate and coordinate with other Left Parties to uphold the Constitutional morality, to ensure the sufferings of the vulnerable sections are addressed by the authorities without violation of their human rights and also to strengthen the solidarity with social activists and movements.

This is the way to pay our respects to Dr. Ambedkar and to pledge on the Constitution to save our Nation.

With revolutionary greetings

Comradely yours

S/d

D. RAJA

General Secretary

DO YOU LIKE THIS ARTICLE?