తెలంగాణలో 154కి పెరిగిన క‌రోనా కేసులు

ప్ర‌జాప‌క్షం/హైద‌రాబాద్ : తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 154కి పెరిగింది. కొత్త‌గా గురువారంనాడు 27 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. గురువారం రాత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ విడుద‌ల చేసిన బులిటెన్‌లో ఈ విష‌యం వెల్ల‌డైంది. గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో మ‌రో ముగ్గురు పేషెంట్ల‌ను డిశ్చార్జి చేశారు. దీంతో డిశ్చార్జి అయిన వారి సంఖ్య 17కి పెరిగింది. అయితే తాజాగా ఎలాంటి మ‌ర‌ణాలు సంభ‌వించ‌క‌పోవ‌డం సంతోష‌క‌ర‌మైన విష‌యం. ఇప్ప‌టివ‌ర‌కు 9 మంది మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రుల్లో ఇంకా 128 మంది చికిత్స పొందుతున్నారు. అంద‌రూ కోలుకుంటున్నార‌ని వైద్య ఆరోగ్య వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపుతున్న నిజాముద్దీన్ వ్య‌వ‌హారంపై నిఘా పెంచారు. నిజాముద్దీన్ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన వారికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించే ప‌నిలో వున్నారు. ఇదిలావుండ‌గా, రాష్ట్రంలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. గురువారం దాదాపు ప్ర‌జ‌లంతా ఈ లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించారు.

DO YOU LIKE THIS ARTICLE?