లోక్‌సభలో కోల్‌కతా వ్యవహారంపై గంద‌ర‌గోళం

న్యూఢిల్లీ: శారదా కుంభకోణంపై కోల్‌కతాలో సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో లోక్‌స‌భ‌లో కేంద్రప్రభుత్వం తీరుకు నిరసనగా తృణమూల్ ఎంపిలు ఆందోళన చేపట్టడంతో గందరగోళ వాతావరణం నెలకొంది. సోమవారం సభ ప్రారంభం కాగానే టిఎంసి ఎంపిలు కోల్‌కతా వ్యవహారాన్ని లేవనెత్తారు. ప్రశ్నోత్తరాల తర్వాత దీనిపై చర్చ చేపడదామని స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టారు. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు సభ ప్రారంభం కాగానే టిఎంసి ఎంపి సౌగతా రాయ్‌ మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాజా పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ.. సిబిఐ అధికారులను విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని రాజ్‌నాథ్‌ అన్నారు. అయితే రాజ్‌నాథ్‌ ప్రసంగాన్ని తృణమూల్‌ నేతలు అడ్డుకోవడంతో సభలో మళ్లీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ సభను వాయిదా వేశారు.

DO YOU LIKE THIS ARTICLE?