ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సోనియాకు బహుమతిగా ఇస్తాం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు సోనియాగాంధీ చేసిన మేలును ఎన్నటికీ మర్చిపోలేరని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మల్లు రవి తెలిపారు. సోనియా జన్మదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లో ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె పుట్టినరోజు బహుమతిగా ఈ ఎన్నికల ఫలితాలను ఇవ్వబోతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్ర‌జాఫ్రంట్‌కు అనుకూలంగా ఓట్లేశారని, 75 నుంచి 80 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మ‌ల్లు ర‌వి ధీమా వ్యక్తం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?