అలోక్‌వ‌ర్మ రాజీనామా

న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) మాజీ డైరెక్టర్‌ ఆలోక్‌వర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో బుధవారం మరోసారి సిబిఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌ను మళ్లీ తప్పిస్తూ కేంద్రం గురువారం సాయంత్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయనను ఫైర్‌ సర్వీసెస్ డిజిగా బదిలీ చేసింది. అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. కానీ ఆ పదవిని చేపట్టేందుకు ఆయన నిరాకరించారు. ఈ పరిణామాలతో మనస్తాపానికి గురై ఉద్యోగానికి రాజీనామా చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?