మద్దతు ధర కోసం మళ్లీ రోడ్డెక్కిన రైతులు

పెర్కిట్‌, జక్రాన్‌పల్లిలో రోడ్డుపై బైఠాయించి వంటావార్పు

ప్రజాపక్షం/నిజామాబాద్‌: మద్దతు ధరపై రైతులు మళ్లీ రోడ్డెక్కారు. పసుపు, ఎర్రజొన్న రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆర్మూర్‌ డివిజన్‌లో 144 సెక్షన్‌ విధించినా రైతులు మద్దతు ధరపై నినదించారు. 44వ జాతీ య రహదారిని దిగ్భందించారు. హైదరాబాద్‌- రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభు త్వం స్పందించకపోవడంతో రైతులు ఆందోళన, ఆగ్ర హం వ్యక్తం చేశారు. శనివారం ఆర్మూర్‌ మండలం పెర్కి ట్‌ మహిళా ప్రాంగణం వద్ద జక్రాన్‌పల్లి మండల కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రెండు చోట్ల ఉదయం 11గంటల నుంచి జాతీయ రహదారిపై బైఠాయించారు. ఉదయం నుంచి సాయంత్రం 7గంటల వరకు రైతులు రోడ్డుపైనే కూర్చుండిపోవడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు రైతులు వంట చేసుకుంటూ రోడ్డుపైనే ఉన్నారు. మహిళలు రోడ్డుపైనే వంటవార్పు చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డుపై బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. 144 సెక్షన్‌ ప్రకటించడంతో రైతులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు రెండు ప్రాంతాల్లో రోడ్డెక్కకుండా అడ్డుకున్నారని రైతులు ఆరోపించారు. రైతు కూలీ సంఘం నాయకులు వి.ప్రభాకర్‌, బి.దేవరాంలను అరెస్ట్‌ చేశారని సంఘం నేతలు తెలిపారు. అయితే పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. మద్దతు ధర ప్రకటించే వరకు తమ ఉద్యమాన్ని కొ నసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. పసుపునకు క్విం టాలకు 15వేలు, ఎర్రజొన్నలకు రు.3500 మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశారు. గత 10రోజుల నుంచి రైతులు ఉద్యమం చేస్తున్నప్పటికీ జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎక్కడికక్కడ పోలీసులు మోహరించారు.
చోద్యం చూస్తున్న ప్రభుత్వం :
రైతు ఉద్యమానికి మద్దతుగా ఉంటూ సిపిఐ జిల్లా నాయకులు రహదారి దిగ్భందంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య మాట్లాడుతూ పది రోజులు పసుపు, ఎర్రజొన్న రైతులు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యమం చేపట్టినా జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందే తప్ప పట్టించుకునే పరిస్థితిలో లేదని విమర్శించారు. 10 రోజుల నుంచి రైతులు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారు. పసుపు క్వింటాలుకు రూ.15 వేలు, ఎర్రజొన్నకు రూ. 3,500 ధర చెల్లించాలని భూమయ్య డిమాండ్‌ చేశారు. దళారులతో కుమ్మక్కై రైతాంగానికి నష్టం చేకూరుస్తున్నారని ఆరోపించారు. మహరాష్ట్ర సాంగ్లీలో పసుపు క్వింటాలుకు 8వేలు ధర చెల్లిస్తున్నారని, నిజామాబాద్‌ మార్కెట్‌లో కేవలం రూ. 4 వేల నుంచి రూ. 5వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. గతంలో ఐడిసిఎంఎస్‌, మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేశారని, ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతు కుటుంబం నుంచి వచ్చామని చెబుతున్న జిల్లా ప్రజాపతినిధులు ఎందుకు నోరు విప్పడం లేదన్నారు. ఎంపి కవిత పసుపు బోర్డు మంజూరుకు హామీనిచ్చిందని, ప్రస్తుతం రైతు ఆందోళనపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతుగా సిపిఐ జిల్లా నాయకులు కె.రాజన్న, జెఎసి జిల్లా నాయకులు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?