8 మంది సజీవదహనం

కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
మృతుల్లో ఆరుగురు మహిళలు, ఒక బాలుడు
ఘజియాబాద్‌ (యుపి) : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 8 మంది సజీవదహనమయ్యారు. కొవ్వొత్తుల తయారీ కంపెనీలో నిప్పు అంటుకొని భారీగా మంటలు చెలరేగా యి. అందులో పనిచేస్తున్న వారిలో కొంతమంది తప్పించుకోవడానికి అవకాశం లేకపోవడంతో ఎనిమిది మంది అగ్నికి ఆహుతయ్యారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. అలాగే 16 ఏళ్ల బాలుడు కూడా మృతుల్లో ఉన్నాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా వుందని అధికారులు తెలిపారు. ఘజియాబాద్‌ నగరంలోని మోడీ నగర్‌ యూనిట్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఫ్యాక్టరీ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌లో వుంది. ముందుగా పేలుడు సంభవించిందని, ఆ తర్వాత ఇంటిపైకప్పుకు నిప్పుఅంటుకొని, ఆ తర్వాత భవనం మొత్తం దగ్థమైందని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగే సమయానికి ఫ్యాక్టరీలో 12 మందికి పైగా కార్మికులు వున్నారని, వారిలో ఎక్కువమంది మహిళలు, పిల్లలేనని చెప్పారు. భవన శకలాల కింద ఒకరిద్దరు చిక్కుకుపోయి వుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. శకలాలను తొలగించడానికి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతానికి 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండు అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పారు. ఈ ఒక అద్దె ఇంటిలో నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు

DO YOU LIKE THIS ARTICLE?