73.20% – ఎట్ట‌కేల‌కు తేలిన పోలింగ్ శాతం!

73.20% పోలింగ్‌ 
గత ఎన్నికల కంటే పెరిగిన పోలింగ్‌ పర్సంటేజ్‌ 
అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 90.95 శాతం 
హైదరాబాద్‌లో 48.9 శాతం  నమోదు 
ప్రజాపక్షం / హైదరాబాద్‌ 
అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన మొత్తం పోలింగ్‌ శాతం వివరాలను ఎట్టకేలకు ఎన్నికల సంఘం శనివారం రాత్రి ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర  ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమర్‌  వెల్లడించారు. శనివారం తెల్లవారు జామున 3.40 గంటలకు జిల్లాల నుంచి వివరాలు అందాయన్నారు.  గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెరిగిందని చెప్పారు. పురుషుల పోలింగ్‌ శాతం 72.54 కాగా, మహిళల పోలింగ్‌ శాతం 73.88 గా నమోదైనట్టు ఆయన వివరించారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.95 శాతం పోలింగ్‌ నమోదు కాగా అతి తక్కువగా  హైదరాబాద్‌లో 48.9 శాతం పోలింగ్‌ నమోదైంది. కాగా నియోజకవర్గాలలో అత్యధికంగా మధిర నియోజకవర్గంలో 91.65 శాతం, అతి తక్కువగా చార్మినార్‌ నియోజకవర్గంలో 40.18 శాతం పోలిండట నమోదైనట్లు రజత్‌కుమార్‌ వివరించారు. ఇదిలా ఉండగా పోలింగ్‌ పూర్తు 24 గంటలు గడిచినప్పటికీ పోలింగ్‌ శాతాన్ని ఎన్నికల అధికారులు వెల్లడించకపోవడం పట్ల శనివారం పలు రాజకీయ పార్టీలు, పోటీ చేసిన అభ్యర్థులు  అనుమానాలు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
జిల్లాలు, నియోజకవర్గాల వారిగా పోలింగ్‌ శాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 
అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా ఓట్లు పోలైన శాతం:  సిర్‌పుర్‌ 85.93, ఆసీఫాబాద్‌ 86.00, చెన్నూర్‌ 82.32, బెల్లంపల్లి 83.10, మంచిర్యాల 73.17, అదిలాబాద్‌ 81.68, బోథ్‌ 85.23,ఖానాపూర్‌ 80.50, నిర్మల్‌ 79.27, ముదోల్‌ 83.79, ఆర్మూర్‌ 76.41, బోధన్‌ 81.09, బాన్సువాడ 83.78, నిజాబాద్‌ అర్బన్‌ 61.77, నిజామాబాద్‌ రూరల్‌ 78.25, బాల్కొండ 79.40, జుక్కల్‌ 85.29, ఎల్లారెడ్డి 86.08, కామారెడ్డి 78.24,కోరుట్ల 75.55, జగిత్యాల్‌ 78.23, ధర్మపురి 79.96, రామగుండం 71.75, మంథని 85.14, పెద్దపల్లి 83.85,కరీంనగర్‌ 68.18, చొప్పదండి 79.35, మానకొడూరు 85.19, హుజురాబాద్‌ 84.00  వేములవాడ 80.41, సిరిసిల్లా 80.57, నారాయణ్‌ ఖేడ్‌ 83.89, ఆందోల్‌ 88.96, జహీరాబాద్‌ 80.91, సంగారెడ్డి 82.27, పఠన్‌చెరువు 75.60, మెదక్‌ 85.88, నర్సాపూర్‌ 90.53, హుస్నాబాద్‌ 83.13, సిద్దిపేట  79.00,దుబ్బాక 85.99, గజ్వేల్‌ 88.63, ఇబ్రహీంపట్నం 76.04, ఎల్‌బి.నగర్‌ 49.33, మహేశ్వరం 55.08, రాజేంద్రనగర్‌ 56.82, శేరిలింగంపల్లి 48.51, చేవెళ్ల 78.67, కల్వకుర్తి 86.71, షాద్‌నగర్‌ 87.56,  పరిగి 75.63,వికారాబాద్‌ 73.70, తాండూర్‌ 76.96, కోడంగల్‌ 81.44,  మేడ్చల్‌ 60.43, మల్కాజ్‌గిరి 53.08, కుద్బుల్లాపూర్‌ 55.84, కూకట్‌పల్లి 57.73, ఉప్పల్‌ 51.54,ముషీరాబాద్‌ 51.34, మలక్‌పేట 42.74,  అంబర్‌పేట 55.85, ఖైరతాబాద్‌ 53.66, జూబ్లిహిల్స్‌ 45.61,  సనత్‌నగర్‌ 52.18,నాంపల్లి  44.02, కార్వాన్‌ 51.76, గోషామహల్‌ 58.61, చార్మినార్‌ 40.18, చంద్రాయణగుట్ట 46.11, యాకుత్‌పురా 41.24, బహదూర్‌పురా 50.40, సికింద్రాబాద్‌ 55.47, కంటోన్మెంట్‌ 49.05,  నారాయణపేట్‌ 79.35, మహబూబ్‌నగర్‌ 73.84, జడ్చర్ల 82.11, దేవరకద్ర 84.56, మక్తల్‌ 77.64, నాగర్‌కర్నూల్‌ 82.42, అచ్చంపేట 81.02, కొల్లాపూర్‌ 82.72,వనపర్తి 81.65,గద్వాల్‌ 83.41, అలంపూర్‌ 82.31, దేవరకొండ 85.98, నాగార్జునసాగర్‌ 86.44, మిర్యాలగూడ 84.57, నల్గొండ 84.13, మునుగోడు 91.07, నకిరేకల్‌ 88.53, హుజూర్‌నగర్‌ 85.96,కోదాడ 88.67, సూర్యపేట్‌ 86.06, తుంగతుర్తి 88.91, భువనగిరి 90.53, ఆలేరు 91.33, జనగాం 85.58, స్టేషన్‌ గన్‌పూర్‌ 87.99, పాలకుర్తి 88.50, దోర్నకల్‌ 88.88,   మహబూబాబాద్‌ 84.73,   నర్సంపేట్‌ 90.06, పరకాల 89.28, వరంగల్‌ వెస్ట్‌ 58.29, వరంగల్‌ ఈస్ట్‌ 72.86, వర్దన్నపేట 83.37,  భూపాలపల్లి 82.13, ములుగు 82.53, పినపాక 81.88, ఇల్లందు 82.09, కొత్తగూడెం 81.19, అశ్వారావ్‌పేట 87.85, భద్రాచలం 80.03, ఖమ్మం 73.98, పాలేరు 90.99, మధిర 91.65,వైరా- 88.83,సత్తుపల్లి 88.65

DO YOU LIKE THIS ARTICLE?